కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టండి: షర్మిల
రాష్ట్రంలో ప్రస్తుతం దోపిడీ, దొంగల రాజ్యం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఆరోపించారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా శేరిగూడెంలో మహిళలతో రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. నిత్యావసర ధరలు, విద్యుత్, వంటగ్యాస్ ధరలపై ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మహిళలు, రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Wed, Feb 06, 2013, 06:50 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View