ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: కేసీఆర్
 
ఈ ఏడాదిలోనే సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవనంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మూడు తీర్మానాలు చేసింది. 

హైదరాబాదులో చేపడుతున్న మెట్రో రైలు మార్గంలో చారిత్రక కట్టడాలు దెబ్బతినకుండా ఆయా ప్రాంతాల్లో భూగర్భ మార్గాలను చేపట్టాలి, రాయితీ వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్య 9 నుంచి 12 కు పెంచాలి, విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకొనేలా ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించినట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు.

తె
లంగాణ రాజకీయ ఐకాస చేపట్టనున్న 'సడక్ బంద్'కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని కేసీఆర్ ప్రకటించారు. మార్చి2వ తేదీన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని దిగ్భందించేందుకు తక్కువ సమయం ఉందనీ, దీనిపై ఐకాసతో చర్చిస్తామనీ కేసీఆర్ తెలిపారు. 
Wed, Feb 06, 2013, 06:05 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com