లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మూడేళ్ల ఖైదు
లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి నెల్లూరు జిల్లా కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. నెల్లూరు జిల్లా తడ చెక్ పోస్టు దగ్గర  వెంకట రమణ నాయక్, మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ గా పనిచేసేవారు. ఓ కేసు విషయంలో 2005 లో ఆయన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీకి మధ్యవర్తి ద్వారా లక్ష రూపాయలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన మీద ఏసీబీ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో నిందితుడు వెంకట రమణకు కోర్టు మూడేళ్ల జైలుశిక్షని విధించింది.
Wed, Feb 06, 2013, 05:18 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View