స్నే'హితుల' కోసం కమల్ ప్రత్యేక ప్రదర్శన
తమిళనాడులో వివాదాస్పదమైన 'విశ్వరూపం' విడుదల కోసం సహకరించిన తన మిత్రులందరికీ నటుడు కమల్ హాసన్ కృతజ్ఞతలు తెలిపాడు. కష్టకాలంలో తనకు మనోధైర్యాన్ని ఇచ్చి, తన వెంట నిలిచిన చిత్రసీమ వారందరి కోసం ఆయన బుధవారం సాయంత్రం ముంబయిలోని 6 డిగ్రీస్ ధియేటర్లో ఆరో 3డి ఫార్మాట్లో 'విశ్వరూపం ' సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. తమిళ నటుడు, కమల్ సన్నిహితుడు రజనీకాంత్ కూడా ఈ ప్రదర్శనని చూడనున్నారు. వివాదాల నుంచి బయటపడ్డ ఈ సినిమా గురువారం తమిళనాడులో విడుదల కానున్న సంగతి విదితమే.
Wed, Feb 06, 2013, 05:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View