మంగళగిరిలో జనసేనాని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Advertisement
జనసేన నాయకులు,కార్యకర్తల సమావేశాలు ఈ నెల 14 వ  తేదీ నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్నాయి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ సమావేశాల్లో ప్రసంగిస్తారు. పార్లమెంట్  నియోజకవర్గాల పరిధిలోని  కార్యకర్తలు, నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్న సంగతి విదితమే. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మంగళగిరిలో జరిగే వేడుకలలో పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ పతాకాన్నిఎగురవేస్తారు.

ఈ నెల 14 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్, 16 వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ పార్లమెంట్, మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోగల అసెంబ్లీ సెగ్మెంట్లలోని నాయకులు, కార్యకర్తలతో  సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.) చైర్మన్ నాదెండ్ల మనోహర్,  పి.ఏ.సి.సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొంటారు.
Fri, Aug 09, 2019, 05:00 PM
Advertisement
2019-11-30T10:11:57+05:30
2019-11-30T09:18:14+05:30
2019-11-29T16:53:23+05:30
2019-11-29T16:33:54+05:30
2019-11-29T16:16:19+05:30
2019-11-29T14:30:10+05:30
2019-11-29T13:10:38+05:30
2019-11-29T11:14:10+05:30
2019-11-29T09:00:42+05:30
2019-11-27T16:05:56+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View