నాంపల్లి కోర్టుకు ఐపీఎస్ ఉమేశ్ కుమార్
సంతకం ఫోర్జరీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానం తదుపరి  విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. రాజ్యసభ సభ్యుడు ఎంఎం ఖాన్ సంతకాన్ని ఉమేశ్ ఫోర్జరీ చేయించడంతో కేసు నమోదైంది. అయితే ఈ కేసును సీఐడీ కోర్టుకు బదిలీ చేయాలని ఉమేశ్ కుమార్ వేసిన పిటిషన్ పై నిర్ణయాన్ని కోర్టు సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది. 
Wed, Feb 06, 2013, 02:09 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View