గాలి బెయిల్ స్కాం కేసుల విచారణ వాయిదా

గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ కుంభకోణాల కేసుల విచారణను అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. డబ్బుతో బెయిల్  కోసం ప్రయత్నించిన కేసులో గాలి జనార్థన్ రెడ్డిని చంచల్ గూడ జైలు సిబ్బంది ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఈ విచారణకు గాలి జనార్థన్ రెడ్డితో పాటు, కేసులో ఇతర నిందితులు ఆయన
సోదరుడు సోమశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే సురేష్ బాబు, మాజీ న్యాయమూర్తులు
ప్రభాకర్ రావు, లక్ష్మీ నరసింహారావు, పట్టాభి రామారావు, చలపతిరావు తదితరులు
హజరయ్యారు.
Fri, Feb 01, 2013, 03:58 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View