విద్యుత్ బిల్లుల మోతతో ప్రజలపై భారం: చంద్రబాబు
ప్రజలకు తాగేందుకు గుక్కెడు నీళ్ళు కూడా దొరకడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు
నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లుల మోతతో ప్రజలపై అధికభారం
పడిందని ఆయన విమర్శించారు. కొద్ది రోజుల విరామం అనంతరం కృష్ణా జిల్లా
మూలపాడు నుంచి 'వస్తున్నా మీకోసం' పాదయాత్రను బాబు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ వంట గ్యాస్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉచితంగా
పొయ్యిలు ఇచ్చిన ఘనత టీడీపీదేనని ఆయన అన్నారు. వంటగ్యాస్ ధర విపరీతంగా
పెంచుకుంటూ పోతున్నారని ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.
Fri, Feb 01, 2013, 03:28 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View