ఇంటర్నేషనల్ యోగ డే ను పురస్కరించుకుని ఇండియా టూరిజం - తెలంగాణ టూరిజం సంయుక్తంగా యోగ కార్యక్రమం
Advertisement
5వ ఇంటర్నేషనల్ యోగ డే ను పురస్కరించుకుని ఇండియా టూరిజం - తెలంగాణ టూరిజం సంయుక్తంగా హుస్సేన్ సాగర్ లోని బుద్ద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ యోగ కార్యక్రమంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇండియా టూరిజం ప్రాంతీయ సంచాలకులు శంకర్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున యోగ సాధకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, యోగ భారత దేశంలో పుట్టిన గొప్ప సంపద, నేడు ప్రపంచ వ్యాప్తంగా మేధావులు, విద్యావంతుల నుండి సామాన్యుల వరకు యోగ సాధన చేస్తున్నారన్నారు. మనిషి జీవితాల యాంత్రికంగా మారి ఎంతో మంది మేధావులు మానసికంగా అలసిపోతున్నారు. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడుకు కూడా యోగ ద్వారా వ్యాయామం అవసరమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నేడు అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లోనూ యోగ ఎంతో ఆదరిస్తున్నారు. మానసిక ఒత్తిడి నుంచి తగ్గించుకుంటున్నారు. మన దేశంలో పుట్టిన యోగ, మెడిటేషన్ లను మన దేశంలో ఇప్పుడిపుడే యువత సాధన చేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరుపున, పర్యాటక శాఖ ప్రదేశాలలో తగిన ప్రచారం చేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 5వ ఇంటర్నేషనల్ యోగ డే ను పురస్కరించుకుని ఇండియా టూరిజం - తెలంగాణ టూరిజం లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన యోగ కేంద్రంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యోగ సాధకులకు యోగ డే శుభాకాంక్షలు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఇంటర్నేషనల్ యోగ డే ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచానికి అందించిన పెద్ద కానుక యోగ. యోగ ప్రక్రియ ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేoదుకు ఎంతో ఉపయోగకరమన్నారు బుర్రా వెంకటేశం.

దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదో సమస్యల వల్ల,లేదా పనివత్తిడి వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానసిక ఒత్తిడి ని జయించే ఏకైక మార్గం యోగ. కొద్దిసేపు ఏ ఆలోచనలు లేకుండా ధ్యానం, మెడిటేషన్ ల ద్వారా ఒత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కోరారు. భారత దేశం అందించిన యోగ సంస్కృతి ని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించి ప్రయోజనం పొందుతున్నారన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగ సాధకులకు శుభాకాంక్షలు తెలిపారు బుర్రా వెంకటేశం.
Sat, Jun 22, 2019, 04:03 PM
Advertisement
2019-12-13T08:39:03+05:30
2019-12-11T20:17:14+05:30
2019-12-11T16:38:02+05:30
2019-11-30T10:11:57+05:30
2019-11-30T09:18:14+05:30
2019-11-29T16:53:23+05:30
2019-11-29T16:33:54+05:30
2019-11-29T16:16:19+05:30
2019-11-29T14:30:10+05:30
2019-11-29T13:10:38+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View