తెలంగాణ డిమాండును తిరస్కరించలేదు: వయలార్ రవి
తెలంగాణ రాష్ట్ర డిమాండును కాంగ్రెస్ ఎప్పుడూ తిరస్కరించలేదని, అది ఎప్పటినుంచో ఉందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు వయలార్ రవి అన్నారు. ఈ అంశంపై మిగతా ఎంపీలందరితో
చర్చిస్తానని ఆయన తెలిపారు. పార్టీల మద్దతు వుందన్న ఒక్క ప్రాతిపదికను
తీసుకొని తెలంగాణపై నిర్ణయం తీసుకోలేము కదా? అని అన్నారు. అయితే 
పార్టీల మద్దతు లభిస్తే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేందుకు అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ ఉదయం ఎంపీ మధు యాష్కీ ఢిల్లీ లో వయలార్ తో 
ప్రత్యేకంగా
భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్న పరిస్థితుల
ను యాష్కీ ఆయనకు వివరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ నెల మరోసారి అందరం కలిసి చర్చిస్తామని
చెప్పారు. తెలంగాణ సెంటిమెంటును యాష్కీ తనకు వివరించారని చెప్పారు.
కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తామన్న ప్రకటనను ఈ సందర్భంగా వాయలార్
ఆహ్వానించారు.
Fri, Feb 01, 2013, 01:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View