కొత్త రంగంలోకి ప్రవేశించిన పేటీఎం
Advertisement


డిజిటల్ చెల్లింపుల ప్రముఖ సంస్థ పేటీఎం, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉద్యోగ ఆంకాక్షదారుల అవసరాలకు పూరించడానికి, తన విద్యా సర్వీసులను గణనీయంగా విస్తరించడానికి ప్రణాళికను ప్రకటించింది. ఈ కంపెనీ వేల కొలదీ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలతో దూకుడుగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుని, చెల్లింపులు, కామర్స్, ఆర్థిక విద్యా సర్వీసుల ద్వారా సంపూర్ణ సర్వీసుల గుచ్ఛాన్ని అందిస్తోంది.

పేటీఎం ఇదివరకే ఫీజు చెల్లింపు సేవలను దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ విద్యాసంస్థలకు అందిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2020లో, ఇది విద్యా వ్యాపారంలో రూ. 20,000 కోట్ల జిఎంవి లక్ష్యాన్ని దాటాలని ప్రణాళిక రచించింది. ఈ కంపెనీ తన వినియోగదారుల నమ్మకంపై పురోగమించి, అన్ని విద్యా అవసరాలకు, వన్ స్టాప్ గమ్యాన్ని అందిస్తోంది.

వినీత్ కౌల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – పేటీఎం ఇలా అన్నారు, "మేము ప్రతి దశలోనూ విద్యార్థి, తల్లిదండ్రులకు వీలు కల్పించాలనుకున్నాము. 25,000 కళాశాలలు, పాఠశాలలు, కోర్సులు, పరీక్షలపై వివరాలను అందించడం నుండి, మా సర్వీసులలో – చెల్లింపులు (యాప్ లో, విద్యా కేంద్రాలలో), కామర్స్ (కోచింగ్, ఉపకారవేతనాలు, పరీక్షకు సిద్ధంకావడం, అడ్మిషన్ పత్రాలు మొదలైనవి) ఆర్థిక సేవలు (విద్యార్థి బీమా, విద్యా లోన్స్ (సులభ ఇఎంఐ) బ్యాంకింగ్) మొదలైనవి ఉన్నాయి.”

పేటీఎం ఎడ్యుకేషన్, భారతదేశంలోని మొత్తం విద్యా ఎకోసిస్టమ్ లో తన ఉనికిని విస్తరించుకోవడానికి ప్రణాళిక రచించింది, దీనికి రూ. 100,000 కోట్ల కంటే ఎక్కువ అంచనా వేసింది. ఇది  ప్రైవేట్, పభుత్వ విద్యా సంస్థలతో పనిచేసి, తన వేదికపై, అడ్మిషన్ ఫారంలు, పరీక్షా ఫలితాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు, కోచింగ్, పరీక్షా శిక్షణలు, విదేశీ విద్య, నైపుణ్య అభివృద్ధి, సర్టిఫికేషన్ ప్రోగ్రాములు, యూనిఫారంలు, పుస్తకాలు, స్టేషనరీ కొనడానికి సౌలభ్యాలను ఆఫర్ చేస్తోంది. ఈ కంపెనీ, విద్యా బీమా, ఋణాలు, కో-బ్రాండెడ్ స్మార్ట్ కార్డ్స్ ను కూడా విద్యార్థులకు అందిస్తోంది.

పేటీఎం, ఇదివరకే ప్రఖ్యాత సంస్థలైన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మహరాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇండియన్ నేవీ, అమిటీ, విఐటి, మణిపాల్, ఎకెటియు, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, ఢిల్లీ యూనివర్శిటీ, ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్‌ఐటిలు, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ, ఎఐఎంఎ, ఐసిఎఐ, నారాయణ గ్రూప్, కెరీర్ లాంచర్, మేడ్ ఈజీ, కెరీర్360 అనేక ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ, 20,000  ప్రైవేట్ స్కూల్స్, 1000 ఉన్నత విద్యా సంస్థలు, 1000 కోచింగ్ సంస్థల ద్వారా 3.5 కోట్ల యూజర్స్ ను ఉపయోగించుకుంటూ, తన అతిపెద్ద సర్వీసుల సమూహంతో ఉన్నత జిఎంవి సాధిస్తోంది.
Wed, Jul 10, 2019, 09:57 AM
Advertisement
2019-11-19T14:23:28+05:30
2019-11-19T09:22:54+05:30
2019-11-18T17:03:54+05:30
2019-11-18T16:20:44+05:30
2019-11-18T15:30:55+05:30
2019-11-18T10:20:24+05:30
2019-11-18T09:37:54+05:30
2019-11-16T14:30:53+05:30
2019-11-16T14:07:18+05:30
2019-11-15T16:20:10+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View