సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ
Advertisement

ఆకుపచ్చ తెలంగాణకై కృషి చేస్తోన్న ప్రకృతి ప్రేమికుడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులు, ఉద్యోగులతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హరిత తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఇదే స్పూర్తితో ఆకుప‌చ్చ తెలంగాణ సాధ‌న దిశ‌గా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. చాలా విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం మొక్క‌ల పెంప‌కంలోనూ నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగాభివృద్ది సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Mon, Feb 17, 2020, 06:51 PM
Advertisement
2020-04-08T18:46:23+05:30
2020-04-08T17:17:38+05:30
2020-04-08T17:10:36+05:30
2020-04-08T17:05:34+05:30
2020-04-08T16:03:05+05:30
2020-04-08T15:28:31+05:30
2020-04-08T15:18:43+05:30
2020-04-08T12:25:19+05:30
2020-04-08T09:16:13+05:30
2020-04-07T18:50:38+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View