జిల్లా నుంచి మండ‌ల స్థాయి వ‌ర‌కు పార్టీ కార్యాల‌యాలు ఏర్పాటు: జనసేన
Advertisement
* ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన జ‌న‌సేన లోక‌ల్‌బాడీ ఎల‌క్షన్ క‌మిటీ

స్థానిక‌ నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేయ‌డం ద్వారా స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో సానుకూల‌ ఫ‌లితాలు సాధించవ‌చ్చ‌ని జ‌న‌సేన పార్టీ లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేసేందుకు వీలుగా స‌మ‌న్వ‌య క‌మిటీలు ఏర్పాటు చేయాల‌నే అంశంపై చ‌ర్చ సాగింది. ఆదివారం విజ‌య‌వాడలోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో లోక‌ల్‌బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ కల్యాణ్ గ‌త నెల 24న త‌మిళ‌నాడు మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీ పి.రామ్మోహ‌న్‌రావు చైర్మ‌న్‌గా ఈ క‌మిటీని నియ‌మించగా, క‌మిటీ స‌భ్యులంతా తొలిసారి స‌మావేశం అయ్యారు.

రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగే అంశానికి సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌కు రూప‌క‌ల్ప‌న చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స‌మావేశం జ‌రిగింది. గ్రామ పంచాయితీ స్థాయి నుంచి కార్పోరేష‌న్ ఎన్నిక‌ల వ‌ర‌కు అభ్య‌ర్ధుల‌ను సిద్ధం చేసే అంశానికి సంబంధించి సుదీర్ఘ చ‌ర్చ సాగింది. స‌భ్యులంతా త‌మత‌మ అభిప్రాయాల‌ను క‌మిటీ చైర్మ‌న్‌కు వివ‌రించారు. పార్టీ సంస్థాగ‌త నిర్మాణం వార్డు స్థాయి నుంచి చేపట్టాలని కమిటీ అభిప్రాయపడింది. నిర్మాణం అనంత‌రం క‌మిటీల‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వివ‌రించి, పార్టీ కార్య‌క‌లాపాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలంటూ సూచ‌న‌లు చేసింది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి నుంచి మండ‌ల స్థాయి వ‌ర‌కు కార్యాల‌యాలు ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించారు.

జనసేన పార్టీ లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ పి.రామ్మోహ‌న్‌రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో క‌మిటీ స‌భ్యులు షేక్ రియాజ్‌, పంతం నానాజీ, వై. శ్రీను, సుంక‌ర శ్రీనివాస్‌, అంకెం ల‌క్ష్మీశ్రీనివాస్‌, కోత పూర్ణ‌చంద‌ర్‌రావు, బాడ‌న వెంక‌ట జ‌నార్ధ‌న్‌, సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, పితాని బాల‌కృష్ణ‌, పాటంశెట్టి సూర్య‌చంద్ర‌, ఘంట‌సాల వెంక‌ట‌ల‌క్ష్మి, పొల‌స‌ప‌ల్లి స‌రోజ‌, చిల‌కం మ‌ధుసూద‌న్‌రెడ్డి, ఇంజా సోమ‌శేఖ‌ర్‌రెడ్డి, స‌య్య‌ద్ జిలానీ, పార్టీ న్యాయ విభాగానికి చెందిన న్యాయ‌వాది శాంతిప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Mon, Jul 08, 2019, 09:24 AM
Advertisement
2019-11-19T14:23:28+05:30
2019-11-19T09:22:54+05:30
2019-11-18T17:03:54+05:30
2019-11-18T16:20:44+05:30
2019-11-18T15:30:55+05:30
2019-11-18T10:20:24+05:30
2019-11-18T09:37:54+05:30
2019-11-16T14:30:53+05:30
2019-11-16T14:07:18+05:30
2019-11-15T16:20:10+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View