కొల్లాపూర్ ను పర్యాటకంగా అభివృద్ది చేస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
Advertisement
నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గములో పర్యాటక ప్రాంతాల అభివృద్దిపై సచివాలయంలో రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో కొల్లాపూర్ సంస్థాన వారసులు వారి సంస్థాన భవనంను పర్యాటకంగా అభివృద్ది చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు విజ్డప్తి చేశారు. కొల్లాపూర్ సంస్థాన వారసుల విజ్ఝప్తి మేరకు మంత్రి పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సంస్థాన భవన ఆభివృద్దిపై చర్చించారు. ఈ ప్రతిపాదనను గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు కొల్లాపూర్ ను పర్యాటకంగా అభివృద్ది చేస్తామన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో కొల్లాపూర్ శాసన సభ్యులు హర్షవర్థన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటక శాఖ కమీషనర్ దినకర్ బాబు, రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు, అటవి శాఖ అధికారి డోబ్రిహాల్ లతో పాటు కొల్లాపూర్ సంస్థాన వారసుడు ఆదిత్యా లక్ష్మణ్ రావు పాల్గోన్నారు.
Sat, Jul 06, 2019, 05:00 PM
2019-07-20T16:32:46+05:30
2019-07-20T16:14:24+05:30
2019-07-20T13:19:23+05:30
2019-07-19T17:14:59+05:30
2019-07-19T17:01:38+05:30
2019-07-19T16:51:52+05:30
2019-07-19T16:47:11+05:30
2019-07-19T10:15:24+05:30
2019-07-19T09:30:38+05:30
2019-07-18T17:01:59+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View