ప్రత్యేక గూర్కాలాండుకి డిమాండ్
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తాము
వ్యతిరేకం కాదంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో గూర్కా జన
ముక్తి మోర్చా (జీజేఎం) తమ డిమాండును మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఒకవేళ
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయితే కనుక, ప్రత్యేక గూర్కాలాండు రాష్ట్రం కూడా
ఏర్పాటు చేయాల్సిందేనని జీజేఎం తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించి జీజేఎం
ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి నేతృత్వంలోని ఓ ప్రతినిధి బృందం కేంద్ర హొమ్
శాఖ కార్యదర్శి ఆర్.కె. సింగ్ ను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించింది. తమ
ఉద్యమానికి, డిమాండుకి 105 సంవత్సరాల సుధీర్గమైన చరిత్ర ఉందనీ, ఇంకా
చెప్పాలంటే దేశంలో తమది అతి పురాతనమైన డిమాండు అనీ రోషన్ గిరి చెప్పారు.
Fri, Feb 01, 2013, 08:39 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View