ఏపీ సీఎం జగన్ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబం
26-01-2023 Thu 08:11 | Andhra
- ‘సిరివెన్నెల’ వైద్య ఖర్చులను భరించిన ఏపీ ప్రభుత్వం
- ఆయన కుటుంబానికి విశాఖలో స్థలం కేటాయింపు
- సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సిరివెన్నెల కుటుంబం
- కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు సినీ గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. సిరివెన్నెల భార్య పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె లలితాదేవి, సోదరుడు సీఎస్ శాస్త్రి తదితరులు నిన్న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
‘సిరివెన్నెల’ వైద్య ఖర్చులను ఏపీ ప్రభుత్వం భరించడంతోపాటు విశాఖపట్టణంలో ఆయన కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించిన నేపథ్యంలో జగన్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సిరివెన్నెల కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
More Latest News
భారత్ జోడో యాత్రలో ఒమర్ అబ్దుల్లా
21 minutes ago

పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు
26 minutes ago

జమున మృతి పట్ల జగన్, కేసీఆర్, చిరంజీవి సంతాపం
29 minutes ago

ఎయిర్ టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
39 minutes ago

'భోళా శంకర్' వాయిదాపడే ఛాన్స్!
1 hour ago

అమెజాన్ లో కొనసాగుతున్న ‘కాస్ట్ కటింగ్’
1 hour ago

తెలుగు తెర 'సత్యభామ' .. జమున
2 hours ago
