రామోజీరావు వాస్తవాలు తెలుసుకుని రాస్తే బాగుంటుంది: ఏపీ మంత్రి మేరుగ నాగార్జున
25-01-2023 Wed 20:41 | Andhra
- సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఈనాడులో కథనం రావడంపై మండిపాటు
- నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించినప్పుడు రామోజీ ఎక్కడున్నారన్న మంత్రి
- చంద్రబాబు దళిత వ్యతిరేకి అని విమర్శ

సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ ఈనాడు పత్రికలో కథనాలు రావడంపై ఏపీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఈనాడు అధినేత రామోజీరావు వాస్తవాలను తెలుసుకుని రాస్తే బాగుంటుందని అన్నారు. సబ్ ప్లాన్ నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించినప్పుడు ఎక్కడున్నారు? అంటూ రామోజీరావును ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో నీ రాతలు ఏమయ్యాయని అడిగారు. చంద్రబాబు హయాంలో జరిగిన అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు దత్తపుత్రుడు అవాస్తవాలను మాట్లాడుతున్నాడని మంత్రి విమర్శించారు. దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబుకు పవన్ ఎలా మద్దతు తెలిపారని ప్రశ్నించారు.
More Latest News
హైదరాబాదీలను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు
5 hours ago

నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి
6 hours ago

తమిళనాడు చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు లేఖ
7 hours ago

హరిరామజోగయ్య పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
8 hours ago
