రిపబ్లిక్ డే వేడుకను నిర్వహించండి: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
25-01-2023 Wed 15:46 | Telangana
- రేపే గణతంత్ర దినోత్సవం
- వేడుకలపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వం
- గైడ్ లైన్స్ ను పాటించాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు

యావత్ భారతదేశం రేపు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోబోతోంది. మరోవైపు, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఏ మాత్రం స్పందించలేదు. అసలు వేడుకలను నిర్వహిస్తున్నారా? లేదా? అనే విషయంలో సైతం సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను ఎక్కడ నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలని తెలిపింది.
More Latest News
హైదరాబాదీలను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు
6 hours ago

నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి
6 hours ago

తమిళనాడు చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు లేఖ
8 hours ago

హరిరామజోగయ్య పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
8 hours ago
