ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
25-01-2023 Wed 13:37 | National
- పొగమంచు కారణంగా సత్యమంగళం అడవుల్లో దిగిన చాపర్
- బెంగళూరు నుంచి తిరుపూర్ వెళుతుండగా ఘటన
- వాతావరణం అనుకూలించాక తిరిగి బయల్దేరి వెళ్లిన రవిశంకర్

ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీ శ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి తిరుపూర్ వెళుతుండగా సత్యమంగళం అటవీ ప్రాంతంలో చాపర్ అత్యవసరంగా దిగింది. దట్టమైన పొగమంచు కారణంగా మార్గం కనిపించకపోవడంతో చాపర్ ను పైలట్ కిందికి దించాడు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా కడంపూర్ హిల్స్ గ్రామం ఉగిన్యాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ దిగడంతో స్థానికులు అక్కడ గుమికూడారు.
ఈ హెలికాప్టర్ లో రవిశంకర్ తో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు. అందరూ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. వాతావరణం అనుకూలించే వరకూ రవిశంకర్ తన సహాయకులతో పాటు అక్కడే వేచి ఉన్నారు. సుమారు గంట తర్వాత పొగమంచు తొలిగిపోగానే అక్కడి నుంచి తిరిగి బయల్దేరి వెళ్లారు.
More Latest News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు
9 minutes ago

కేటీఆర్ కరీంనగర్ పర్యటనను అడ్డుకున్న ఏబీవీపీ.. ఉద్రిక్తత
25 minutes ago

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
46 minutes ago

తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ
52 minutes ago

పవన్ కల్యాణ్ కి ఆదాయం కంటే .. అప్పులు ఎక్కువ: నాగబాబు
59 minutes ago

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్
1 hour ago

అమరావతే రాజధాని అని, అక్కడే ఇల్లు కట్టుకున్నానని సీఎం కాకముందు జగన్ చెప్పలేదా?: సోము వీర్రాజు
1 hour ago

పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
1 hour ago
