-->

బ్యాంకును దోచేసి, తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ... కానీ...!

23-01-2023 Mon 20:39 | International
China woman was caught after a fraud in Bank

సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో చైనాలో ఓ బ్యాంకు క్లర్క్ తాను పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసింది... తప్పించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంది... కానీ పాతికేళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడింది. 

చెన్ వైల్ అనే మహిళ యెకింగ్ నగరంలో చైనా కన్ స్ట్రక్షన్ బ్యాంకులో క్లర్కుగా పనిచేసేది. బ్యాంకు గుట్టుమట్లన్నీ గుర్తించిన ఆమె... ఓ లోపాన్ని ఆధారంగా చేసుకుని, తన ఖాతాలో లేని సొమ్మును ఉన్నట్టుగా సాంకేతిక మార్పులు చేసింది. తన ఖాతాలో భారీమొత్తం జమ అయినట్టుగా ఎడిట్ చేసింది. ఆ తర్వాత తన ఖాతా నుంచి డబ్బును డ్రా చేసుకుంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి ప్లాస్టిక్ సర్జరీతో కొత్త రూపాన్ని పొందింది. 

కాగా, తాను మోసపూరితంగా పొందిన డబ్బులో కొంత తన పుట్టింటివారు కూడా తీసుకునేలా తన అకౌంట్ పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచింది. అయితే, అంత భారీ మొత్తంలో డబ్బు ఆమె ఖాతాలో ఉండడంపై పుట్టింటివారు అనుమానించారు. అసలు విషయం తెలుసుకుని ఆమెను మందలించారు. ఇదంతా 1997లో జరిగింది. 

ఈ నేపథ్యంలో, చెన్ వైల్ మరో ప్రావిన్స్ కు తన మకాం మార్చింది. అక్కడ పేరు మార్చుకోవడమే కాదు, పెళ్లి కూడా చేసుకుని ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమెకు గతంలో ఓసారి పెళ్లయినా, ఆ విషయాలేవీ చెప్పకుండా, కొత్త రూపురేఖలతో రెండో పెళ్లి చేసుకుంది. కాలక్రమంలో ఆమె వ్యాపారవేత్తగా ఎదిగింది. 

అయితే, పోలీసులు 1997 నుంచి ఆమె కోసం వెదుకుతూనే ఉన్నారు. ఏమైతేనేం, ఇటీవల ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై పలు అభియోగాలతో కేసులు నమోదు చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది దుర్మరణం
  • కారును ఢీకొని లోయలో పడిపోయిన బస్సు
  • ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు, ప్రధాని, ముఖ్యమంత్రి
  • గత నెలలో జరిగిన ప్రమాదంలో 41 మంది మృతి

ap7am

..ఇది కూడా చదవండి
టర్కీ భూకంప విలయం.. మృత్యుంజయులు ఈ చిన్నారులు!
  • టర్కీ, సిరియా భూకంప ప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వేలాదిమంది
  • కొనసాగుతున్న రెస్క్యూ కార్యక్రమాలు
  • శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు బాలురను క్షేమంగా బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది

..ఇది కూడా చదవండి
మరోసారి చైనా బెలూన్ కలకలం... ఈసారి లాటిన్ అమెరికా దేశాలపై!
  • ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్ కలకలం
  • మిస్సైల్ తో బెలూన్ ను కూల్చివేసిన అమెరికా
  • కొన్నిరోజుల వ్యవధిలో మరో బెలూన్ ప్రత్యక్షం
  • కొలంబియా, కోస్టారికా, వెనిజులా దేశాల మీదుగా పయనం


More Latest News
30 killed in Road accident in Pakistan Khyber Pakhtunkhwa
Now Zoom to lay off around 1300 employees
Kiara Advani And Sidharth Malhotra Shared their Wedding Pics
PhonePe Now in UAE Singapore and other countries
Children rescued from under debris of collapsed buildings in Turkey
Siya Gautam weds Mumbai businessman
Nara Lokesh enters into a secretariat in Chittoor
Vedha pre release event
Natasha Perianayagam the most talented student in the world
Viajayasai Reddy raised his voice in Rajya Sabha on special status for AP
Double decker bus in Hyderabad
Second China balloon spotted in Latin American countries airspace
Kotamreddy held meeting with his followers
Vinaro Bhagyamu Vishnu katha Trailer Release Event
Boeing set to layoff thousands of employees
..more