ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసు జారీ చేసిన ప్రభుత్వం
23-01-2023 Mon 14:17 | Andhra
- ఇటీవల గవర్నర్ ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
- రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు
- ఉద్యోగుల సంఘం చర్యను తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం
- గవర్నర్ ను కలవడంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసు

ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్ ను కలిసి తమ సమస్యలు నివేదించడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసు జారీ చేసింది.
సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులో పేర్కొంది. గవర్నర్ కు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేశామని వెల్లడించింది.
ఉద్యోగుల వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే మార్గం ఉందని తెలిపింది. ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు గవర్నర్ ను ఎందుకు కలవాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.
More Latest News
ధోనీ, గంగూలీ వల్లే నేను ఈ రోజు ఇలా..: హర్మన్ ప్రీత్ కౌర్
10 minutes ago

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న సినిమాలు ఇవే!
19 minutes ago

గత ఇరవై ఏళ్లలో 5 భారీ భూకంపాల వివరాలు..
25 minutes ago

300 కోట్లు కొల్లగొట్టిన విజయ్ 'వరిసు'!
58 minutes ago

బీహార్ లో మాయమైన రైల్వే ట్రాక్!
1 hour ago

బెలూన్ శకలాలను చైనాకు ఇచ్చేది లేదు: అమెరికా
1 hour ago

జగన్ ప్రకటనతో ఊపందుకున్న విశాఖ రాజధాని పనులు!
4 hours ago

ఏపీ రాజధాని అంశంపై వాదనలు విన్న సుప్రీం కోర్టు
12 hours ago
