-->

పాలక్కాడ్‌లో పట్టుబడిన పోకిరీ ఏనుగు.. ధోనీ అని పేరు పెట్టిన మంత్రి!

23-01-2023 Mon 07:15 | National
Kerala Forest darting team goes after rampaging elephant PT 7

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో రెండేళ్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఏనుగును ఎట్టకేలకు అటవీ అధికారులు బంధించారు. జనావాసాలను, పంటలను నాశనం చేస్తూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న ఈ ఏనుగు ఎప్పుడు ఎక్కడ దాడిచేస్తుందో తెలియక జనం హడలిపోయేవారు. గతేడాది జులైలో మార్నింగ్ వాక్ చేస్తున్న 60 ఏళ్ల వృద్ధుడిని తొక్కి చంపింది. జిల్లాలోని ధోనీ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలను వణికిస్తున్న ఈ పోకిరీ ఏనుగును పట్టుకునేందుకు అటవీ అధికారులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఏనుగుకు అధికారులు పాలక్కాడ్ టస్కర్-7 (పీటీ-7) అని పేరు పెట్టారు. 

ఈ ఏనుగును పట్టుకునేందుకు వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకారియా నేతృత్వంలోని ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీం’ నిన్న తెల్లవారుజామున అడవిలోకి వెళ్లి ఏనుగు కోసం కాపుకాసింది. అది కనిపించగానే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి బంధించింది. ఏనుగు పట్టుబడిన విషయం తెలిసిన ధోనీ గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. సాయంత్రం అవుతోందంటే భయంగా ఉండేదని, ఇప్పుడిక ప్రశాంతంగా ఉండొచ్చని అన్నారు. ఏనుగు పట్టుబడిన విషయం తెలుసుకున్న కేరళ అటవీశాఖ మంత్రి శశీంద్రన్ గ్రామానికి వచ్చి డాక్టర్ అరుణ్ జకారియా బృందాన్ని అభినందించారు. పట్టుబడిన ఏనుగుకు ‘ధోనీ’ అని పేరు పెట్టారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
కన్యత్వ పరీక్ష.. మహిళల గౌరవానికి భంగం కలిగించడమే: ఢిల్లీ హైకోర్టు
  • ఈ పరీక్షకు శాస్త్రీయతలేదని సుప్రీంకోర్టు కూడా తేల్చిచెప్పింది
  • కేసు దర్యాప్తులో భాగం కాబోదు.. పరీక్షించడం అమానుషం
  • నన్ మృతి కేసులో తీర్పు చెబుతూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు 

ap7am

..ఇది కూడా చదవండి
జేఈఈ మెయిన్స్ ఫలితాలలో తెలుగు విద్యార్థుల హవా
  • గత నెలలో 24 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు
  • ఈ నెల 1న కీ విడుదల
  • తాజాగా 20 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్
  • వారిలో పలువురు తెలుగు విద్యార్థులు

..ఇది కూడా చదవండి
ప్రధానికి, అదానీకి వున్న సంబంధమేంటి?: పార్లమెంటులో రాహుల్ గాంధీ
  • అదానీ ఆస్తులు 8 బిలియ‌న్ల డాల‌ర్ల నుంచి 140 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు ఎలా పెరిగాయని నిలదీసిన రాహుల్ 
  • మోదీ పర్యటించిన దేశాల్లో అదానీ కాంట్రాక్టులు పొందారని ఆరోపణ
  • 2014లో ఢిల్లీకి మోదీ చేరుకున్నాక అసలు మ్యాజిక్ మొదలైందని ఎద్దేవా


More Latest News
virginity test is unhuman says delhi highcourt
Kutty Padmini Interview
Govt school teacher who hasnt taken leave for 12 years In Tamil Nadu
Pradhan mantri awas yojan beneficiaries elope with lovers abandoning their husbands
Delhi Liquor Policy Scam BRS MLC K Kavitha Ex CA Butchi Babu Arrested
Zimbabwe Batter Gary Ballance becomes second player in Test history to set rare record
30 killed in Road accident in Pakistan Khyber Pakhtunkhwa
Now Zoom to lay off around 1300 employees
Kiara Advani And Sidharth Malhotra Shared their Wedding Pics
PhonePe Now in UAE Singapore and other countries
Children rescued from under debris of collapsed buildings in Turkey
Siya Gautam weds Mumbai businessman
Nara Lokesh enters into a secretariat in Chittoor
Vedha pre release event
Natasha Perianayagam the most talented student in the world
..more