5 స్టార్ హోటల్ కు రూ. 23 లక్షల బిల్లు ఎగ్గొట్టి వెళ్లిన వ్యక్తి అరెస్ట్
22-01-2023 Sun 17:00 | International
- ఢిల్లీలోని లీలా ప్యాలస్ హోటల్ కు టోకరా
- నిందితుడు దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్
- ఫేక్ కార్డుతో 3 నెలల పాటు హోటల్ లో ఉన్న వైనం

ఢిల్లీలోని ఫైవ్ స్టార్ లీలా ప్యాలస్ హోటల్ కు రూ. 23 లక్షల బిల్లును ఎగ్గొట్టి వెళ్లిపోయిన మహమ్మద్ షరీఫ్ (41) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడకు చెందిన ఈ వ్యక్తి తాను యూఏఈ ప్రభుత్వ అధికారినని హోటల్ సిబ్బందిని తప్పుడు డాక్యుమెంట్లతో నమ్మించాడు. ఫేక్ బిజినెస్ కార్డును చూపించి దాదాపు 3 నెలలకు పైగా హోటల్ లో ఉన్నాడు. రూ. 23,46,413 లక్షల బిల్లును ఎగ్గొట్టి, హోటల్ కు చెందిన విలువైన వస్తువులతో పరారయ్యాడు.
ఘటనకు సంబంధించి ఈ నెల 14న ఢిల్లీలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. లీలా ప్యాలస్ హోటల్ జనరల్ మేనేజర్ అనుపమ్ దాస్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షరీఫ్ ఈ హోటల్ లో 2022 ఆగస్ట్ 1 నుంచి 2022 నవంబర్ 20 వరకు ఉన్నాడు.
More Latest News
సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు
12 hours ago

విమానంలో చంద్రబాబు పక్కనే వైసీపీ నేత... వీడియో వైరల్
13 hours ago
