'నాటునాటు' పాటకు కాలు కదిపిన రామ్ చరణ్ అత్తగారు.. వీడియో ఇదిగో
21-01-2023 Sat 15:39 | Entertainment
- ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న నాటునాటు సాంగ్
- ప్రస్తుతం దావోస్ లో ఉన్న శోభన కామినేని
- మరో మహిళతో కలిసి నాటునాటు సాంగ్ కు డ్యాన్స్

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆస్కార్ రేసులో సైతం నిలిచింది. మరోవైపు ఈ చిత్రంలోని 'నాటునాటు' పాట గోల్డెన్ గ్లోబ్ వంటి అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంటోంది.
తాజాగా ఈ పాటకు రామ్ చరణ్ భార్య ఉపాసన తల్లి శోభన కామినేని కూడా కాలు కదిపారు. మరో మహిళతో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. ప్రస్తుతం శోభన దావోస్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంతో గర్విస్తున్న అత్తయ్య అంటూ పోస్ట్ చేశారు.
More Latest News
కోటంరెడ్డి భద్రత 1 ప్లస్ 1 కు తగ్గింపు
8 hours ago

సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు
12 hours ago
