రెండు నెలల్లో విశాఖ పాలన రాజధాని అవుతుంది: గుడివాడ అమర్నాథ్
21-01-2023 Sat 14:43 | Andhra
- మూడు రాజధానులపై వెనక్కి తగ్గని ఏపీ ప్రభుత్వం
- ప్రభుత్వ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభమవుతాయన్న అమర్నాథ్
- మరోసారి చర్చను లేవనెత్తిన మంత్రి వ్యాఖ్యలు

మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విపక్షాల నుంచి ఎంతో వ్యతరేకత ఉన్నప్పటికీ... వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ అవతరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో మూడు రాజధానులపై మరోసారి చర్చ ప్రారంభమయింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఫిబ్రవరి చివర్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావచ్చు.
More Latest News
నేను పెళ్లే చేసుకోకూడదని అనుకున్నాను: బాలయ్యతో పవన్ కల్యాణ్!
25 minutes ago

నాకు ఎవరంటే భయమంటే: 'అన్ స్టాపబుల్ 2' వేదికపై పవన్!
56 minutes ago

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
1 hour ago

విద్యా శాఖపై జగన్ సమీక్ష.. కీలక సూచనలు
10 hours ago

వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ తప్పించుకోలేడు.. అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయి: చంద్రబాబు
10 hours ago

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు
12 hours ago
