-->

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్!

21-01-2023 Sat 14:38 | International
Chris Hipkins To Be New Zealand PM

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక దాదాపు ఖరారైంది. అధికార లేబర్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే పోటీలో ఉన్నారు. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీలందరూ కలిసి క్రిస్ హిప్కిన్స్ ను అధికారికంగా ఎన్నుకుంటారు. తర్వాత న్యూజిలాండ్ 41వ ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ‘‘క్రిస్ హిప్కిన్స్‌ నామినేషన్‌ను ఆమోదించడానికి, ఆయన్ను పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడానికి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు సమావేశమవుతాం’’ అని లేబర్ పార్టీ సీనియర్ సభ్యుడు డంకన్ వెబ్ ఒక ప్రకటనలో తెలిపారు.

గురువారం ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించి జెసిండా ఆర్డెర్న్ అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు లేబర్ పార్టీలో 44 ఏళ్ల క్రిస్ కు మాత్రమే నామినేషన్ దక్కింది. ప్రస్తుతం హోం, విద్యా శాఖ మంత్రిగా క్రిస్ పని చేస్తున్నారు. ప్రధానిగా ఎన్నికైతే వచ్చే అక్టోబర్ దాకా ఆ పదవిలో కొనసాగుతారు. అక్టోబర్ 14న న్యూజిలాండ్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

క్రిస్ హిప్కిన్స్ 2008లో తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 2020 నవంబర్ లో కరోనా రెస్పాన్స్ శాఖ మంత్రిగా పనిచేశారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
వికీపీడియా సర్వీసులను బ్లాక్ చేసిన పాకిస్థాన్
  • ‘దైవ దూషణ’పై కంటెంట్ ను తొలగించలేదని వికీపీడియాపై చర్యలు తీసుకున్న పాక్
  • ముందుగా 48 గంటల గడువు ఇచ్చినట్లు వెల్లడి
  • తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే వికీపీడియా విస్మరించిందని విమర్శ

ap7am

..ఇది కూడా చదవండి
చిచ్చు పెట్టిన గూఢచర్య బెలూన్.. బ్లింకెన్ చైనా పర్యటన రద్దు
  • అమెరికా గగనతలంలో సంచరించిన చైనా హాట్ఎయిర్ బెలూన్
  • గూఢచర్యానికి చైనా పాల్పడుతున్నట్టు అనుమానించిన అగ్రరాజ్యం
  • దీంతో కీలకమైన బ్లింకెన్, యెల్లెన్ పర్యటన వాయిదా

..ఇది కూడా చదవండి
నిర్మలమ్మ బడ్జెట్ కు తాలిబన్ల మెచ్చుకోలు. ఎందుకంటే..!
  • ఆఫ్ఘనిస్థాన్ కు రూ.200 కోట్ల సాయం ప్రకటించిన ఆర్థిక మంత్రి
  • అక్కడ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల కొనసాగింపునకు ఖర్చు చేస్తామని వెల్లడి
  • ఈ నిర్ణయంతో ఆఫ్ఘన్, భారత్ మధ్య బంధం మరింత బలోపేతం


More Latest News
Revanth Reddy slams Governor after her speech in assembly
Security reduced for Kotamreddy
Explosion near Sunny Leon fashion show
Lokesh gets grand welcome in Galla Aruna Kumari village
Adimulapu Suresh reacts on Kotamreddy phone tapping issue
Chandrababu says AP fall behind Bihar in startup development
Student commits suicide in Gudur and warden died due to shock
Ramya Rao questions DGP about her son
Bhanupriya Interview
DIG Ravi Prakash says police have no intention to obstruct Nara Lokesh padayatra
Former pacer Sohail Khan says Pakistan have many bowlers like Umran Malik
Five new judges for Supreme Court
Stone pelting on Vande Bharat train in Khammam district
TDP leader GV Reddy press meet
YCP leader travels along with TDP chief Chandrababu
..more