-->

అప్పట్లో నా ఆఫర్ కు సత్యం రామలింగరాజు నుంచి స్పందన రాలేదు: ఆనంద్ మహీంద్రా

21-01-2023 Sat 14:17 | Business
I offered merging of Tech Mahindra in to Satyam Computers says Anand Mahindra

మన దేశం ఐటీ రంగంలో దూసుకుపోవడానికి కారకులైన వ్యక్తుల్లో సత్యం రామలింగరాజు ఒకరు. ఆయన నాయకత్వంలో సత్యం కంప్యూటర్స్ ఎంతో ఉన్నతమైన ఎత్తుకు ఎదిగింది. అయితే సత్యం కంప్యూటర్స్ నుంచి మైటాస్ కు నిధులను తరలించడంతో ఆయన పతనం ప్రారంభమయింది. చివరకు సత్యం కంప్యూటర్స్ ను టెక్ మహీంద్రా టేకోవర్ చేసింది. 

మరోవైపు మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సత్యం కంప్యూటర్స్ సంక్షోభం బయటపడటానికి ఒక ఏడాది ముందే ఆ సంస్థలో తమ కంపెనీ టెక్ మహీంద్రాను విలీనం చేద్దామనుకున్నానని... దీనికి సంబంధించి రామలింగరాజుతో ప్రతిపాదన కూడా చేశానని తెలిపారు. అయితే ఆయన నుంచి తనకు స్పందన రాలేదని చెప్పారు. బహుశా సత్యం కంప్యూటర్స్ లో ఆర్థిక లొసుగులు ఉండటమే దానికి కారణం కావచ్చని అన్నారు. 

హైదరాబాదులో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పాటయినప్పుడు రామలింగరాజుతో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ రోజుల్లో టెక్ మహీంద్రా, సత్యం కంప్యూటర్స్ బిజినెస్ మధ్య సారూప్యతలు ఉండేవని... అందుకే సత్యంలో తమ సంస్థను విలీనం చేయాలని భావించి ఆయనకు ఆఫర్ ఇచ్చానని చెప్పారు. రూ. 5 వేల కోట్ల విలువైన సత్యం స్కామ్ 2009లో బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సత్యంను టెక్ మహీంద్రా టేకోవర్ చేసింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
6,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న డెల్
 • ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం
 • నష్టాలు ఎదుర్కొంటున్న కంప్యూటర్ తయారీ రంగం
 • డెల్ సంస్థకూ తప్పని ఇబ్బందులు
 • 5 శాతం మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
 • ఇప్పటికే మెమో జారీ

ap7am

..ఇది కూడా చదవండి
పది రోజుల్లోనే అదానీ సంపద రూ.9 లక్షల కోట్లు ఆవిరి
 • హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత భారీగా నష్టపోతున్న అదానీ గ్రూప్ షేర్లు
 • 217 బిలియన్ డాలర్ల విలువ నుంచి 99 బిలియన్ డాలర్లకు పడిపోయిన అదానీ మార్కెట్ విలువ
 • ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానం నుంచి 21వ స్థానానికి అదానీ

..ఇది కూడా చదవండి
బ్లూంబెర్గ్ కుబేరుల జాబితాలో 21వ స్థానానికి పడిపోయిన అదానీ
 • అదానీ గ్రూప్ పాలిట ప్రతికూలంగా మారిన హిండన్ బర్గ్ నివేదిక
 • అదానీ సంస్థలపై లక్షల కోట్ల రుణభారం ఉందన్న హిండన్ బర్గ్
 • భారీగా పతనమైన అదానీ కంపెనీల షేర్లు
 • 3 రోజుల్లో రూ.5 లక్షల కోట్లు హాంఫట్


More Latest News
Ganguly and Dhoni played big role in my life Star batter harman preet kour
New Films in OTT
5 most devastating earthquakes in the last two decades
Indian American Woman To Head Harvard Law Review
Varisu Movie Update
Railway Track Worth Crores Illegally Sold To Scrap Dealer In Bihar
Aaron Finch retires from international cricket
No Intention To Return Balloon Debris To China says usa officials
Social Media Split into two over a woman question
3 records that Kohli can break in the upcoming series against Australia
NTA Released JEE Main Session 1 Results
Turkey Syria Earthquake death toll raised to 3800
AP Officials Searching For A House in Visakhapatnam For AP CM Jagan
Pak PM Shehbaz Sharif Warns India
Supreme Court takes up hearing on AP Capital issue
..more