కియా పరిశ్రమకు చంద్రబాబు అభినందన
21-01-2023 Sat 10:27 | Andhra
- ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును దక్కించుకున్న కియా
- కియా కేరెన్స్ వేరియంట్ కు అవార్డు
- చాలా సంతోషంగా ఉందన్న చంద్రబాబు

నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఏపీకి తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కియా కార్ల పరిశ్రమ ఒకటి. అనంతపురం జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. తాజాగా 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023' అవార్డును కియా సొంతం చేసుకుంది. కియా కేరెన్స్ వేరియంట్ కు ఈ అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా కియా పరిశ్రమకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. అనంతపురం ప్లాంటులో ఉత్పత్తి అవుతున్న కేరెన్స్ వేరియంట్ కు అవార్డు దక్కడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఇది గర్వించదగ్గ తరుణమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కియా పరిశ్రమ ఫొటోలు, ట్రయల్ ప్రొడక్షన్ సెరెమొనీ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు.
More Latest News
నాకు ఎవరంటే భయమంటే: 'అన్ స్టాపబుల్ 2' వేదికపై పవన్!
17 minutes ago

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
1 hour ago

విద్యా శాఖపై జగన్ సమీక్ష.. కీలక సూచనలు
9 hours ago

వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ తప్పించుకోలేడు.. అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయి: చంద్రబాబు
10 hours ago

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు
11 hours ago

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల
14 hours ago

టీడీపీ నేతపై కాల్పుల ఘటన పట్ల జిల్లా ఎస్పీ వివరణ
14 hours ago
