-->

సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటన... ముగ్గురి ఆచూకీ గల్లంతు

20-01-2023 Fri 19:41 | Telangana
Three persons missing in Secunderabad fire accident

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తుల ఆచూకీ తెలియరాలేదు. నిన్న డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. 22 ఫైరింజన్లతో దాదాపు 12 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. అప్పటికే భవనం దాదాపు పూర్తిగా కాలిపోయింది. 

ఈ భవనం నుంచి అగ్నిమాపక సిబ్బంది పలువురిని కాపాడగా... బీహార్ కు చెందిన కూలీలు వసీమ్, జునైద్, జహీర్ ల ఆచూకీ గల్లంతైంది. వారి సెల్ ఫోన్ లొకేషన్ కాలిపోయిన బిల్డింగ్ నే సూచిస్తుండడంతో వారు సజీవంగా ఉండే అవకాశాలు తక్కువని భావిస్తున్నారు. ఇవాళ కాలిపోయిన భవనం పరిశీలనకు అధికారులు డ్రోన్ ను పంపించగా, దగ్ధమైన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

డెక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో ఇంకా అమితమైన వేడిగా ఉండడంతో అక్కడికి ఎవరూ వెళ్లలేకపోతున్నారు. కాగా, నిన్నటి సహాయక చర్యల్లో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురికాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
కేసీఆర్ ను కలిసిన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు.. ఫొటోలు ఇవిగో
 • శివాజీ 13వ వారసుడు శంభాజీ
 • కొల్హాపూర్ సంస్థాన వారసుడు శంభాజీ
 • శివాజీ వంశస్తుల సేవలను స్మరించుకుకున్న కేసీఆర్, శంభాజీ

ap7am

..ఇది కూడా చదవండి
బీఆర్ఎస్ దూకుడు.. కేసీఆర్ సమక్షంలో నేడు బీఆర్ఎస్ లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గమాంగ్
 • ఇతర రాష్ట్రాలకు బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో కేసీఆర్
 • బీఆర్ఎస్ లో చేరుతున్న గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు
 • ఒడిశా బీఆర్ఎస్ బాధ్యతలను గిరిధర్ కు కేసీఆర్ అప్పగించే అవకాశం

..ఇది కూడా చదవండి
మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు
 • రాంగోపాల్‌పేటలోని దక్కన్ మాల్‌లో ఇటీవల అగ్నిప్రమాదం
 • ముగ్గురు సజీవ దహనం
 • భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో ముందే కూల్చేయాలని నిర్ణయం
 • రూ.33 లక్షలతో టెండరు దక్కించుకున్న మాలిక్ ట్రేడర్స్
 • గత రాత్రి భవనంలో మళ్లీ మంటలు


More Latest News
Dubbing artist Srinivasa Murthy passes away
Adani Group companies face bloodbath on Dalal Street
Omar Abdullah joins Rahul Gandhi in Bharat Jodo Yatra
Ambati Rambabu comments on Nara Lokesh and Pawan Kalyan
Jagan KCR Chiranjeevi condole Jamuna death
Airtel launches 2 new prepaid plans for users who browse social media all day
I have death threat from Ramya says Naresh
Bhola Shankar Movie Update
Nara Lokesh offers prayers to Lord Varadaraja Swamy
After firing 18000 employees Amazon is selling some of its offices to cut costs
Low pressure in Bay of Bengal may leads rain in AP
Rajinikanth recalls his addiction to drinking and smoking says my wife Lathas love changed me
Chhatrapati Shivaji descendant Sambaji meets KCR
Jamuna Special
Shah Rukh Khan Pathan Film Crosses Rs 235 Crore Worldwide
..more