చింతకాయల విజయ్ నివాసానికి సీఐడీ పోలీసులు... ఆయన తల్లికి నోటీసుల అందజేత
20-01-2023 Fri 15:40 | Andhra
- 'భారతి పే' సోషల్ మీడియా పోస్టుల కేసులో నోటీసులు
- నర్సీపట్నం వెళ్లిన సీఐడీ అధికారులు
- ఇంట్లో లేని చింతకాయల విజయ్
- ఈ నెల 27న విచారణకు హాజరవ్వాలని స్పష్టీకరణ

టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు, ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ పాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ పోలీసులు నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెళ్లారు. 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు చింతకాయల విజయ్ నివాసానికి వెళ్లారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులు అందించారు. చింతకాయల విజయ్ ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో 'భారతి పే' పేరిట పోస్టులు పెట్టినట్టు చింతకాయల విజయ్ పై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులోనే తాజాగా నోటీసులు ఇచ్చారు.
More Latest News
300 కోట్లు కొల్లగొట్టిన విజయ్ 'వరిసు'!
4 minutes ago

బీహార్ లో మాయమైన రైల్వే ట్రాక్!
10 minutes ago

అరోన్ ఫించ్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై!
33 minutes ago

బెలూన్ శకలాలను చైనాకు ఇచ్చేది లేదు: అమెరికా
39 minutes ago

జగన్ ప్రకటనతో ఊపందుకున్న విశాఖ రాజధాని పనులు!
3 hours ago

ఏపీ రాజధాని అంశంపై వాదనలు విన్న సుప్రీం కోర్టు
12 hours ago

6,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న డెల్
14 hours ago
