-->

అల్లు అర్జున్ కు యూఏఈ గోల్డెన్ వీసా.. టాలీవుడ్ లో తొలి హీరోగా రికార్డ్

20-01-2023 Fri 14:02 | Entertainment
allu arjun gets golden visa from uae

పుష్ప సినిమాతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగానూ ఎంతోమంది ఆయనకు అభిమానులయ్యారు. తాజాగా అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ నుంచి ‘గోల్డెన్ వీసా’ను ఆయన అందుకున్నారు. 

ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బన్నీ పంచుకున్నారు. ‘‘ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు దుబాయ్‌కి ధన్యవాదాలు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్స్. త్వరలో మళ్లీ కలుద్దాం’’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.     

కేవలం కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇస్తుంటుంది. బాలీవుడ్‌ నటులు షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, ఊర్వశి రౌతేలా, వరుణ్ ధావన్‌, మలయాళ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ వంటి వారు గోల్డెన్ వీసా అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలో అల్లు అర్జున్ కూడా చేరారు. టాలీవుడ్ లో గోల్డెన్ వీసా అందుకున్న తొలి హీరోగా రికార్డు సృష్టించారు.

ఈ గోల్డెన్ వీసాను పొందే వ్యక్తులకు యూఏఈ రాజధాని అబుదాబీ లేదా దుబాయ్ తదితర సిటీల్లో పదేళ్ల వరకు నివసించే వెసులుబాటు ఉంటుంది. విదేశీయులకు లాంగ్‌టర్మ్ రెసిడెన్సీకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం 2019లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే గోల్డెన్ వీసాలను ప్రవేశపెట్టింది. 

ఈ వీసాను ఆటోమెటిక్‌గా పునరుద్ధరిస్తారు. గోల్డెన్ వీసా ఉన్నవారు అక్కడ సొంతంగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. అయితే సైన్స్, సినిమా, క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభావంతులైన, పేరు పొందిన వ్యక్తులకు మాత్రమే ఈ గోల్డెన్ వీసా ఇస్తారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఆయనతో నాది తండ్రీకొడుకుల అనుబంధం: చిరంజీవి భావోద్వేగం
  • పితృ సమానులైన విశ్వనాథ్ ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్న చిరంజీవి
  • తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంస
  • విశ్వనాథ్ కీర్తి అజరామరమైనదన్న మెగాస్టార్

ap7am

..ఇది కూడా చదవండి
యూట్యూబ్ చానల్ ప్రారంభించిన కె. రాఘవేంద్ర రావు
  • కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కేఆర్ఆర్ వర్క్స్ పేరిట చానల్
  • ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభం
  • షార్ట్ ఫిల్మ్ స్క్రిప్టులు, వెబ్ సిరీస్ కథలను పంచుకోవాలని కోరిన యాంకర్ సుమ

..ఇది కూడా చదవండి
కళాతపస్వి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్, జగన్, చంద్రబాబు
  • తెలుగు సినిమా ఉన్నంత కాలం విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందన్న కేసీఆర్
  • ఆయన మరణం విచారానికి గురి చేసిందన్న జగన్
  • విశ్వనాథ్ మృతి వార్త కలచి వేసిందన్న చంద్రబాబు


More Latest News
Hong Kong is Giving Away 500000 Free Air Tickets
Chiranjeevi emotional tweet on K Vishwanath
Dilish Parekh the man with worlds largest camera collection died
SS Rajamouli Launches KRR Works YouTube Channel of K Raghavendra Rao
Deepa meets Panneerselvam
YCP Rebel MLA Kotamreddy Sridhar Reddy Coming With Press Meet
Officials say that It was a mock drill in the new secretariat
Raghurama Krishna Raju Counters Kodali Nani Comments
KCR Jagan Chandrababu pays condolences to K Vishwanath
The accused escaped by jumping into the river in Nellore Dist
4th Class Girls Drinks Pesticide in School in Mulugu Dist
Telangana budget session Starts Today
Fire Accident in Telangana Secretariat
Tollywood Director K Vishwanath Passed Away
Jagans suggestions on education
..more