విజయ్ ఆంటోనీకి తీవ్ర గాయాలు అంటూ ప్రచారం... కుటుంబ సభ్యుల వివరణ
19-01-2023 Thu 16:06 | National
- మలేషియాలో బిచ్చగాడు-2 షూటింగ్
- విజయ్ ఆంటోనీ ఉన్న బోట్ మరో పడవను ఢీకొన్న వైనం
- విజయ్ ఆంటోనీ నడుముకు గాయం
- మలేషియా నుంచి చెన్నై చేరిక

'బిచ్చగాడు' చిత్రంతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ఓ బోట్ ప్రమాదంలో గాయపడ్డాడు. మలేషియాలో 'బిచ్చగాడు-2' షూటింగ్ జరుగుతుండగా, ఈ ప్రమాదం జరిగింది.
విజయ్ ఆంటోనీ ఉన్న బోట్ వేగంగా వస్తూ ఎదురుగా ఉన్న పడవను ఢీకొట్టింది. అయితే ఆయన తీవ్రంగా గాయపడినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు.
జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, విజయ్ ఆంటోనీకి నడుముకు తేలికపాటి దెబ్బ తగిలిందని వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన పనేమీలేదని, విజయ్ ఆంటోనీ చెన్నై చేరుకున్నాడని వివరించారు. ప్రస్తుతం కోలుకుని తన సినిమా పనుల్లో పాల్గొంటున్నాడని తెలిపారు.
More Latest News
జగన్ ప్రకటనతో ఊపందుకున్న విశాఖ రాజధాని పనులు!
2 hours ago

ఏపీ రాజధాని అంశంపై వాదనలు విన్న సుప్రీం కోర్టు
11 hours ago

6,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న డెల్
13 hours ago

మరో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ!
13 hours ago

మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర అరెస్ట్
14 hours ago

'వసంత కోకిల' ట్రైలర్ పై స్పందించిన మెగాస్టార్!
15 hours ago
