-->

లోకేశ్ పాదయాత్రతో యువతకు దిశానిర్దేశం: యనమల

19-01-2023 Thu 14:43 | Andhra
lokesh yuvagalam yatra will bring TDP into power in andhrapradesh

మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విమర్శించారు. ఏటా జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ యువతకు జగన్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ల మాటే మరిచిపోయారని మండిపడ్డారు.

టీడీపీ హయాంలో ఇచ్చిన నిరుద్యోగ భృతిని కూడా కక్షపూరితంగా రద్దు చేశారని చెప్పారు. జగన్ రెడ్డి హామీలను నమ్మి మోసపోయిన రాష్ట్ర యువతకు దిశానిర్దేశం చేసేలా యూత్ ఐకాన్ నారా లోకేశ్ చేపట్టే యువగళం పాదయాత్ర కొనసాగుతుందని యనమల వివరించారు. ఈ నెల 27న చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి ప్రారంభమయ్యే యువగళం యాత్రతో జగన్ రెడ్డి అరాచక పాలనకు పతనం మొదలవుతుందని యనమల జోస్యం చెప్పారు.

400 రోజులు, 4 వేల కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రతో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మహా పాదయాత్రలో పాలు పంచుకోవాలని రాష్ట్ర ప్రజలకు యనమల పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు సంతోషానికి దూరమయ్యారని యనమల పేర్కొన్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు, జే ట్యాక్స్ వేధింపులతో పారిశ్రామికవేత్తలు సతమతమవుతున్నారని ఆరోపించారు.

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రశ్నార్థకంగా మారగా.. రాజధాని అమరావతిని చంపేశారని, సీమ అభివృద్ధిని అటకెక్కించారని మండిపడ్డారు. భూకబ్జాలతో ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని, జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని యనమల పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ధైర్యం చెప్పేందుకు లోకేశ్ చేపడుతున్న యువగళం యాత్ర తోడ్పడుతుందని యనమల చెప్పారు.

ప్రజల్లో భరోసా నింపడంతో పాటు రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వేదిక కానుందని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ఈ యాత్ర ద్వారా భరోసా కల్పిస్తామని వివరించారు. యువగళం యాత్ర ప్రకటన తర్వాత ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తుంటే.. పాదయాత్ర రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తుందని అర్థమవుతుందని యనమల రామకృష్ణుడు చెప్పారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. కుటుంబ సభ్యులతో కూడా వాట్సాప్ కాల్ మాట్లాడాల్సి వస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
  • సొంత పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న ఆనం
  • రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదని వ్యాఖ్య
  • వైసీపీ ప్రభుత్వ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి

ap7am

..ఇది కూడా చదవండి
వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో లీక్
  • తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న కోటంరెడ్డి
  • తాను ఆధారాలు బయటపెడితే ప్రభుత్వం షేక్ అవుతుందని వ్యాఖ్య
  • ఇద్దరు ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయన్న కోటంరెడ్డి

..ఇది కూడా చదవండి
లోకేశ్ పాదయాత్ర 5వ రోజు షెడ్యూల్.. పలు సామాజికవర్గ ప్రతినిధులతో భేటీ
  • 5వ రోజుకు చేరుకున్న యువగళం పాదయాత్ర
  • కృష్ణాపురం టోల్ గేట్ విడిది కేంద్రం నుంచి యాత్ర ప్రారంభం
  • తమిళ గౌడ సామాజికవర్గంతో భేటీ కానున్న లోకేశ్


More Latest News
Sunny Leone injured in shooting
Somu Veerraju slams CM Jagan on AP Capital issue
My phone is tapping says Anam Ramanarayana Reddy
Nagababu Interview
YV Subbareddy opines on Visakha capital
AP Employees leader Suryanarayana demands govt on pending bills
I will contest from TDP says YSRCP MLA Kotamreddy Sridhar Reddy
Lucknow Curator Sacked For Preparing a Shocker pitch
Raja Singh comments on police notices
Nirmala Sitharam introduces economic survey in Lok Sabha
Hindenburg report Adani loses 34billion dollars in 3 days now only 11th richest
Veda telugu trailer released
CM Jagan says he will shift Visakha soon
Virat Kohli Anushka Sharmas Spiritual Break In Rishikesh Ashram
PURE EV launches Indias most affordable electric motorcycle at Rs 99999 with 130 km range
..more