-->

రంగారెడ్డి జిల్లాలో కిడ్నాపైన యువతిని కాపాడిన పోలీసులు

09-12-2022 Fri 20:31 | Telangana
Police rescues kidnapped dental doctor Vaishali

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఇవాళ 100 మంది వచ్చి ఓ యువతిని కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. డెంటల్ డాక్టర్ ముచ్చర్ల వైశాలిని నవీన్ రెడ్డి అనే యువకుడు పెద్ద సంఖ్యలో కుర్రాళ్లను వెంటేసుకుని వచ్చి కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. కాగా, నవీన్ రెడ్డి, అతడి గ్యాంగ్ కోసం తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టిన పోలీసులు, కొన్ని గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు. కిడ్నాపైన డాక్టర్ వైశాలిని కాపాడారు. ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిన నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి.

వైశాలి, నవీన్ గతంలో ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. పెళ్లికి వైశాలి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో నవీన్ రెడ్డి సివిల్ కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపాడు. తాను, వైశాలి సహజీవనం చేశామని తెలిపాడు. 

ఇటీవల వైశాలికి నిశ్చితార్థం జరగడంతో భరించలేకపోయిన నవీన్ రెడ్డి... వైశాలి నివాసంపై దాడికి దిగాడు. వైశాలిని బలవంతంగా తనతో తీసుకెళ్లాడు. దాంతో ఆగ్రహించిన వైశాలి కుటుంబ సభ్యులు నవీన్ రెడ్డికి చెందిన మిస్టర్ టీ రెస్టారెంట్ ను అగ్నికి ఆహుతి చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు... నాకు పాత వాహనమా?: రాజాసింగ్
  • తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తోందన్న రాజాసింగ్
  • అధికారులు మరమ్మతులు చేసి పంపించారని వెల్లడి
  • ఆ వాహనంలో తిరగకపోతే నోటీసులు పంపిస్తున్నారని ఆవేదన
  • అందులో తిరిగితే ఎక్కడ ఆగిపోతుందో తెలియదని వ్యాఖ్యలు

ap7am

..ఇది కూడా చదవండి
ఆస్తులు కాదు.. ఆహ్లాదకర వాతావరణాన్ని ఇవ్వాలి: తలసాని
  • పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న మంత్రి 
  • మొక్కలను నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారమవుతామని వ్యాఖ్య 
  • హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని ప్రశంస 

..ఇది కూడా చదవండి
తెలంగాణ రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం
  • నేడు రిపబ్లిక్ డే వేడుకలు
  • తెలంగాణ రాజ్ భవన్ లో పలువురు ప్రముఖులకు సన్మానం
  • నాటు నాటు పాటకు అంతర్జాతీయ పాప్యులారిటీ
  • ఆస్కార్ నామినేషన్ పొందిన వైనం


More Latest News
Coca Cola reportedly brings smart phone in India
The news that Kohli and Dhoni gave costly gifts to KL Rahul are baseless
Raja Singh fires on Telangana govt
Yezdi and Jawa bikes in new colours
Balakrishna fell down on vehicle
 Nara Lokesh gets huge welcome at Kuppam guest house
Nirmala Sitharaman prepares Halwa in Parliament ahead of Budget announcement
Ruturaj Gaikwad injured ahead of T20 series with New Zeland
Nara Lokesh Yuva Galam padayatra starts tomorrow
Youth stolen bikes to impress girl friend
Talasani requests all to plant plants
Cargo Ship sink in sea between Japan and South Korea
Governor Tamilisai felicitates MM Keeravani and Chandrabose
Kangana Ranaut response on Pathan Movie
Learn about women issues says Bandi Sanjay
..more