మాండూస్ ఎఫెక్ట్... ఉప్పాడ బీచ్ లో ఎగసిపడుతున్న అలలు
09-12-2022 Fri 16:54 | Andhra
- బంగాళాఖాతంలో మాండూస్ తుపాను
- గంటకు 12 కిమీ వేగంతో తీరం దిశగా పయనం
- ఉప్పాడ తీరంలో పెరిగిన నీటిమట్టం
- తీరంలో ఈదురుగాలులు

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను కొనసాగుతోంది. గంటకు 12 కిమీ వేగంతో మాండూస్ తీరం దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలోని కాకినాడ జిల్లాలో ఉప్పాడ బీచ్ వద్ద అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ సముద్ర తీరంలో నీటిమట్టం పెరిగింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు బీచ్ రోడ్డు వరకు దూసుకొస్తున్నాయి. తీరంలో ఈదురుగాలులు వీస్తున్నాయి.
అలలు, ఈదురుగాలుల ఉద్ధృతి పెరగడంతో కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలను నిషేధించారు. తిమ్మాపురం పోలీసులు, మెరైన్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు, అలల తాకిడి భారీగా పెరగడంతో మత్స్యకారులు బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
More Latest News
నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్
7 hours ago

కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
8 hours ago

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
8 hours ago

యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
10 hours ago
