-->

ఇవి చేసి చూడండి.. కంటి చూపులో మార్పు కనిపిస్తుంది!

09-12-2022 Fri 14:06 | Health
 ways to improve your eye sight naturally

4జీ టెక్నాలజీ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ యూజర్ల కంటికి విశ్రాంతి కరవైందనే చెప్పుకోవాలి. రిలయన్స్ జియో చౌక రేట్లకే మొబైల్ డేటాను వినియోగదారులకు పరిచయం చేసి స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని పెంచేసింది. ఇప్పుడు 4జీ కంటే ఎన్నో రెట్లు వేగవంతమైన 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. మరో ఏడాదిలో దేశమంతటినీ 5జీ టెక్నాలజీ చుట్టేయనుంది. 

సాధారణంగా నేడు చాలా ఉద్యోగాల్లో కంప్యూటర్ వినియోగం భాగమైపోయింది. మార్కెటింగ్ చేసే వ్యక్తులు సైతం ల్యాప్ టాప్ లో డేటా పంపించాల్సిన అవసరం ఉంటోంది. ఒకవైపు కంప్యూటర్, మరోవైపు ఖాళీ దొరికితే స్మార్ట్ ఫోన్ లో బ్రౌజింగ్, యూట్యూబ్, ఓటీటీ వీక్షణ కంటి చూపుకు హాని చేస్తోంది. అందుకని ప్రతి ఒక్కరూ తమ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేయదగిన అతి సులభ వ్యాయామ చిట్కాలు ఉన్నాయి. నిపుణులు తెలియజేస్తున్న ఆ వివరాలు మీ కోసం.

పామింగ్
 ఇది చాలా సులభమైన వ్యాయామం. కంటిపై ఒత్తిడి తగ్గించి, చూపును పెంచుతుంది. రెండు అర చేతులను రబ్ చేసి (రుద్దుకుని) వేడి ఎక్కిన వెంటనే, కళ్లు మూసుకుని, రెండు కళ్లపై రెండు చేతులను కొన్ని సెకన్ల పాటు పెట్టుకోవాలి. ఇలా 5-7 సార్లు చేయాలి. గంటకోసారి ఇలా చేయాలి.

ఐ రోలింగ్
అంటే  కనుగుడ్లను అటూ, ఇటూ, చుట్టూ తిప్పేయడం. రోజులో ఎన్ని సార్లు అయినా ఇలా చేయవచ్చు. ముందుగా గడియారం ముల్లు మాదిరిగా (క్లాక్ వైజ్) తిప్పాలి. ఆ తర్వాత వ్యతిరేక దిశలో తిప్పాలి. 

దృష్టి మార్చడం
కంప్యూటర్ వైపే ఎక్కువ సమయం పాటు చూసే వారు.. కనీసం అరగంటకు ఒకసారి అయినా చుట్టూ ఉన్న వాటివైపు చూడడం చేయాలి. గ్రీన్ రంగులో ఉన్న వాటిని చూస్తే కళ్లకు ఇంకా మంచిది. అలా చూస్తున్నప్పుడు అర చేయివైపు చూసి, ఆ తర్వాత ఎదురుగా చుట్టూ ఉన్న వాటిని చూడాలి.

బ్లింకింగ్
 కను రెప్పలు తెరుస్తూ, మూయడం కూడా మంచి విన్యాసమే. రెండు సెకండ్ల పాటు కను రెప్పలు మూసి, మళ్లీ తెరవాలి. తర్వాత కనురెప్పలను వేగంగా ఐదు సెకండ్ల పాటు కొట్టాలి (తెరుస్తూ, మూయాలి). ఇలా ఐదు సార్లు చేయాలి. 

20-20-20
కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ చూస్తున్న వారు కనీసం 20 నిమిషాలకు ఒకసారి.. 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని, 20 సెకండ్ల పాటు చూడడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
పండ్ల రసాలు కాకుండా, ఈ జ్యూసెస్ తో మంచి ఆరోగ్యం
  • ఉసిరి, అల్లం రసంతో మంచి ఫలితాలు
  • శతావరి జ్యూస్ తో ఎన్నో లాభాలు
  • వీట్ గ్రాస్ జ్యూస్ ను కూడా తీసుకోవచ్చు.

ap7am

..ఇది కూడా చదవండి
మీ షాంపూలో సల్ఫేట్స్ ఉన్నాయేమో చూసుకోండి..!
  • వీటివల్లే శిరోజాల రంగు మటుమాయం
  • తలవెంట్రుకలపై జిడ్డు, మురికి వదిలించేందుకు వాడే కెమికల్స్ ఇవి
  • సల్ఫేట్స్ లేని ఇతర షాంపూలను పరిశీలించొచ్చు

..ఇది కూడా చదవండి
పంచదారను నెలపాటు మానేస్తే ఏమవుతుంది?
  • చక్కెర కారణంగా మన రక్తంలోకి అధిక కేలరీలు
  • దీని కారణంగా స్థూలకాయం, టైప్2 మధుమేహం, గుండె జబ్బులు
  • గణనీయంగా తగ్గించుకోవడం, లేదంటే మానివేస్తే మంచి ఫలితాలు


More Latest News
Vasantha Kokila Trailer Relesaed
Congress MLAs opines about their meeting with Akbaruddin Owaisi
Third earthquake hits Turkey and Syria
Ali reiterates about poll contest
Modi shocks after powerful earthquake hits Turkey and Syria
Another massive earthquake hits Turkey
CM Jagan announces ten lakhs to Asha Malaviya
Vedha pre release event
Bandi Sanjay reacts on Telangana budget
minister dharmana prasada rao criticizes chandrababu
Renuka Chowdary says if needed she will contest from Gidivada
Buttabomma Monday Talk
 Russian Planes Engine Catches Fire During Takeoff With Over 300 People Onboard
Controversy looms on Victoria Gowri appointment as Madras High Court Additional Judge
On Seeing Taj Mahal Pervez Musharrafs First Question Was This
..more