వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
09-12-2022 Fri 11:35 | Both States
- తన భావాలకు మద్దతుగా ఉండే పార్టీతో ఉంటానన్న లక్ష్మీనారాయణ
- ఏపీ, తెలంగాణ మళ్లీ కలిస్తే మంచిదేనని వెల్లడి
- రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని వ్యాఖ్య

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి తన ఆలోచనను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని తెలిపారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయంపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోందని చెప్పారు. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు.
More Latest News
సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా
12 minutes ago

'అమిగోస్' నుంచి బాలయ్య హిట్ సాంగ్ రీమిక్స్!
2 hours ago

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
3 hours ago

తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ
3 hours ago
