మధ్యాహ్నం లోటస్ పాండ్ లో దీక్షకు దిగనున్న షర్మిల
09-12-2022 Fri 10:52 | Telangana
- షర్మిల పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు
- హైకోర్టు అనుమతించినా పోలీసులు అనుమతించడం లేదని షర్మిల విమర్శలు
- పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేయనున్న షర్మిల

తన పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అసహనం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల పాదయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందనే కారణంతో పాదయాత్రకు వరంగల్ పోలీస్ కమిషనర్ అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆమె మధ్యాహ్నం 12 గంటలకు లోటస్ పాండ్ లో దీక్ష చేపట్టనున్నారు. పాదయాత్రకు అనుమతించని పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేయనున్నారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతించకపోవడంపై ఆమె మండిపడుతున్నారు. పాదయాత్ర సందర్భంగా షర్మిల వాహనానికి టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. షర్మిల పాదయాత్ర కొనసాగితే ఇలాంటి ఘటనలే మళ్లీ పునరావృతమవుతాయని పోలీసులు భావిస్తున్నారు.
More Latest News
'వసంత కోకిల' ట్రైలర్ పై స్పందించిన మెగాస్టార్!
1 minute ago

అక్బరుద్దీన్ ఒవైసీని కలవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరణ
12 minutes ago

టర్కీలో మళ్లీ భూకంపం... వేలల్లో మృతుల సంఖ్య!
1 hour ago

బాలయ్య చీఫ్ గెస్టుగా 'వేద' ప్రీ రిలీజ్ ఈవెంట్!
2 hours ago

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై బండి సంజయ్ స్పందన
2 hours ago

'బుట్టబొమ్మ' (మండే టాక్)
3 hours ago
