షర్మిల ఘటన బాధాకరం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
08-12-2022 Thu 12:15 | Telangana
- షర్మిల ఘటనను అందరూ ఖండించాలన్న కోమటిరెడ్డి
- ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని వెల్లడి
- ఏ పార్టీలోకి వెళ్తాననే విషయాన్ని ఎన్నికలకు ముందు చెపుతానని వ్యాఖ్య

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. షర్మిల ఘటనను అందరూ ఖండించాలని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. మరో ఏడాదిన్నర పాటు తన నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి పెడతానని చెప్పారు. తాను ఏ పార్టీలోకి వెళ్తాననే విషయాన్ని ఎన్నికలకు నెల ముందు చెపుతానని అన్నారు. వేరే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని బలం అనుకుంటోందని టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
More Latest News
ఉత్కంఠపోరులో టీమిండియాదే విజయం
8 hours ago

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు
8 hours ago

బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం
9 hours ago

రెండో టీ20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్
9 hours ago

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
10 hours ago

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్
10 hours ago

టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్
11 hours ago

లోకేశ్ యువగళం పాదయాత్రకు కర్ణాటక పోలీసులు
12 hours ago

సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ఖరారు
13 hours ago
