మహేశ్ బాబు ఖాతాలో మసాలా యాడ్... మీరూ చూడండి!
07-12-2022 Wed 19:07 | Both States
- ఎవరెస్ట్ గరం మసాలా యాడ్ లో నటించిన మహేశ్ బాబు
- ఆసక్తికరంగా యాడ్
- యాడ్ వీడియో పంచుకున్న ఎవరెస్ట్ స్పైసెస్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రిని కోల్పోయిన దుఃఖం నుంచి బయటికి వచ్చి తన కార్యకలాపాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు తాజాగా ఓ యాడ్ లో నటించారు. ఇప్పటికే మహేశ్ బాబు అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో మరో బ్రాండ్ చేరింది. ఇది ఎవరెస్ట్ గరం మసాలా యాడ్.
ఈ వాణిజ్య ప్రకటనను మహేశ్ బాబు తనదైన శైలిలో రక్తి కట్టించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎవరెస్ట్ స్పైసెస్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ యాడ్ వీడియోను కూడా పంచుకుంది. "సౌత్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటి భోజనం తయారీలో ఎవరెస్ట్ గరం మసాలానే వాడతారన్న విషయం ఇప్పుడే తెలిసింది" అంటూ ఎవరెస్ట్ స్పైసెస్ తన యాడ్ కంటెంట్ ను వివరించింది.
More Latest News
సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా
22 minutes ago

'అమిగోస్' నుంచి బాలయ్య హిట్ సాంగ్ రీమిక్స్!
2 hours ago

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
3 hours ago

తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ
4 hours ago
