నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో చంద్రబాబు భేటీ
06-12-2022 Tue 14:30 | Andhra
- నిన్న ఢిల్లీలో అఖిలపక్ష భేటీ
- ప్రధాని మోదీ అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశం
- డిజిటల్ నాలెడ్జ్ గురించి వివరించిన చంద్రబాబు
- నీతి ఆయోగ్ అధికారులతో మాట్లాడాలని సూచించిన మోదీ

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో సమావేశమయ్యారు. జీ20 సమావేశంపై మాట్లాడాలన్న ప్రధాని సూచన మేరకు చంద్రబాబు పరమేశ్వరన్ అయ్యర్ తో భేటీ అయ్యారు. విజన్ డాక్యుమెంట్ కు సంబంధించి తన అభిప్రాయాలతో కూడిన నోట్ ను చంద్రబాబు ఈ సందర్భంగా పరమేశ్వరన్ అయ్యర్ కు అందించారు.
నిన్న ఢిల్లీలో జరిగిన జీ-20 సన్నాహక అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించిన డిజిటల్ నాలెడ్జ్ అంశంపై మోదీ ఆసక్తి కనబరిచారు. చంద్రబాబు సూచించిన అంశాన్ని తన ప్రసంగంలోనూ పేర్కొన్నారు. ఈ సందర్భంగానే డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు సూచించారు.
More Latest News
నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్
5 hours ago

కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
6 hours ago

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
6 hours ago

యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
8 hours ago
