-->

మైనర్ అంగీకరించినా సరే.. అది అత్యాచారమే!: రేప్ కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానం

06-12-2022 Tue 09:55 | National
Consent Of Minor Is Not Consent says delhi Court

మైనారిటీ తీరని అమ్మాయి లేదా అబ్బాయి ఆమోదంతోనే లైంగికంగా కలిసినప్పటికీ చట్ట ప్రకారం అది అత్యాచారం కిందికే వస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఓ అత్యాచారం కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మైనర్ కు కీలక నిర్ణయాలు తీసుకునే మానసిక పరిణతి ఉండదని, అందుకే మైనర్ ఇష్టప్రకారం, పూర్తి సమ్మతితో జరిగినప్పటికీ దానిని అత్యాచారం కిందనే పరిగణిస్తామని జస్టిస్ జస్మీత్ సింగ్ పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన పదహారేళ్ల అమ్మాయి 2019లో ఇంట్లో నుంచి వెళ్లిపోయి 23 ఏళ్ల యువకుడితో కలిసి ఉంది. సుమారు ఒకటిన్నర నెలల పాటు అతడితోనే ఉంది. ఆ యువకుడికి అప్పటికే పెళ్లయింది. కూతురు కనిపించడంలేదని అమ్మాయి తండ్రి కేసు పెట్టడంతో పోలీసులు అమ్మాయితో పాటు యువకుడిని గాలించి పట్టుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో యువకుడిపై కిడ్నాప్, అత్యాచారం ఆరోపణల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్న యువకుడు తాజాగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.

నిందితుడి బెయిల్ పిటిషన్ పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా.. అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇద్దరూ కలిసి ఉంటున్నారని నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే, మైనర్ తెలిపే అంగీకారం ఆమోదయోగ్యం కాదంటూ జడ్జి వ్యాఖ్యానించారు. పైగా, అమ్మాయి ఆధార్ కార్డులో పుట్టిన రోజు వివరాలను మార్చి, అమ్మాయి మైనర్ కాదని చూపేందుకు నిందితుడు ప్రయత్నించాడని జడ్జి పేర్కొన్నారు. ఆధార్ లో తప్పుడు మార్పులు చేయడం తీవ్రమైన నేరమని అన్నారు. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్ ను జడ్డి కొట్టేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
నాటు బాంబు తయారు చేస్తుండగా పేలుడు.. రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్
  • బాంబు పేలి చెన్నైకి చెందిన గ్యాంగ్ స్టర్ కు తీవ్ర గాయాలు
  • చేతులు పూర్తిగా ఛిద్రం.. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స
  • బాంబుల తయారీ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు 

ap7am

..ఇది కూడా చదవండి
పాకిస్థాన్ లో అక్రమంగా పఠాన్ చిత్ర ప్రదర్శనలు... టికెట్ రేటు రూ.900
  • జనవరి 25న రిలీజైన పఠాన్
  • ఇప్పటిదాకా రూ.700 కోట్లకు పైగా వసూలు
  • భారత చిత్రాలపై పాక్ లో నిషేధం
  • అయినప్పటికీ కొనసాగుతున్న పఠాన్ చిత్ర ప్రదర్శనలు
  • ప్రతి థియేటర్లోనూ హౌస్ ఫుల్ బోర్డులు

..ఇది కూడా చదవండి
ఇవే నా చివరి ఎన్నికలు.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
  • వచ్చే ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానన్న సిద్ధరామయ్య
  • రాజకీయాల నుంచి రిటైర్ కాబోనని వెల్లడి
  • మరో మూడు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 


More Latest News
kcr meeting at nanded maharashtra
Gunmen breaks into tears after MLA Kotamreddy returns his security personnel
Australia gets another blow before first test
Huge blast in Pakistans Quetta leaves many injured
Yanamala targets Buggana and CM Jagan
Chandrababu visits K Viswanath house
dastagiri sensational comments on viveka murder case
Teachers held protest to remove CPS
Chennai gangster injured while making crude bomb loses both hands
Pathaan movie being screened illegally in Pakistan
Upcoming polls will be my last election says former Karnataka CM Siddaramaiah
Raghunandan Rao demands to send Telangana DGP to AP
Pathan becomes highest grosser worldwide hindi movie
Vinod Kambli wife accuses him of assaulting abusing her FIR registered
Madhyapradesh teenager rapes and kills a 58 old woman in rewa district
..more