టీమిండియాకు స్లో ఓవర్ రేట్ జరిమానా
05-12-2022 Mon 21:15 | Sports
- బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో భారత్ ఓటమి
- నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా విసిరిన భారత్
- 80 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా

బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో ఓడిపోయిన టీమిండియాకు స్లో ఓవర్ రేట్ జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేదన్న కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 80 శాతం జరిమానాగా విధించారు.
భారత జట్టు నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినట్టు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళే గుర్తించారు. ఇది ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం తప్పిదం. ఒక ఓవర్ కు 20 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. ఆ లెక్కన టీమిండియా నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేయడంతో 80 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరంలేకుండా జరిమానాతో సరిపెట్టారు.
More Latest News
సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
18 minutes ago

ఇవే నా చివరి ఎన్నికలు.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
51 minutes ago

మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్ చిత్రం
1 hour ago

ఎమ్మెల్సీ తలశిల రఘురాంను ఓదార్చిన సీఎం జగన్
1 hour ago

ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల
2 hours ago

బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ మంత్రి మండలి ఆమోదం
2 hours ago

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా
2 hours ago
