-->

రాయలసీమ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు: శ్రీకాంత్ రెడ్డి

05-12-2022 Mon 16:52 | Andhra
Chandrababu has no moral right to speak about Rayalaseema says Srikanth Reddy

కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనే కోరిక ప్రజలలో బలంగా ఉందని... వారిలో ఉన్న కోరికను చూసి ఆశ్చర్యపోతున్నామని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కర్నూలులో నిర్వహించిన రాయలసీమ గర్జన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి జగన్ రాజధాని వికేంద్రీకరణను చేపడుతున్నారని అన్నారు. 

రాయలసీమకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి యత్నిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు. తన మనుషులతో కోర్టులో కేసులు వేయిస్తూ కర్నూలుకు హైకోర్టు రాకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని చెప్పారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టులను చేపట్టింది రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే జగన్ ఆకాంక్ష అని... అందుకే అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రాంతాల మధ్య విభేదాలు రాకూడదనే వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటు: కొడాలి నాని
  • ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు
  • కోటంరెడ్డిలాంటి వారు పార్టీ నుంచి వెళ్తేనే మంచిది
  • జగన్ కు నమ్మకం తప్ప అనుమానాలు ఉండవు

ap7am

..ఇది కూడా చదవండి
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్
  • వైసీపీలో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చన్న బాలినేని
  • అది ఫోన్ ట్యాపింగ్ కాదు... ఫోన్ రికార్డింగ్ అని వ్యాఖ్య
  • కోటంరెడ్డి స్నేహితుడిని మీడియా ముందుకు తెస్తామన్న బాలినేని

..ఇది కూడా చదవండి
కేంద్ర బడ్జెట్ లో ఏపీ స్పెషల్ స్టేటస్ పై ఎలాంటి హామీ లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
  • రైల్వే కారిడార్ గురించి ప్రస్తావించలేదని మిథున్ రెడ్డి విమర్శ
  • ఆక్వా ఉత్పత్తుల దిగుమతి సుంకాలపై రాయితీ ఇవ్వడం మంచి పరిణామమని వ్యాఖ్య
  • విభజన హామీలను అమలు చేయాలని పట్టుబడతామన్న ఎంపీ 


More Latest News
India wins T20 series against New Zealand
Kodali Nani comments on Kotamreddy
Nara Lokesh padaya 6th day
Subhman Gill century in t20 against New Zealand
Chidambaram comments on Union budget
Ram Mohan Naidu fieres on Jagan
Shakunthalam lyrical song release
Balineni response on Kotamreddy Phone tapping allegations
Amigos movie update
31 YSRCP MPs does not did any thing for AP in union budget says Chandrababu
YSRCP MP Mithun Reddy response on Union budget
Sasivadane lyrical song released
Perni Nani on phone tapping issue
Jagan key meeting with Sajjala and police amid Kotamreddy phone tapping allegations
Nirmala Sitharaman press meet after budget announcement
..more