-->

ఫైమా ఎలిమినేషన్ .. ఆమె చేతిపై నాగ్ ముద్దు!

05-12-2022 Mon 10:04 | Entertainment
Bigg Boss 6 Update

బిగ్ బాస్ హౌస్ లో మొన్న శనివారం రోజున.. నిన్న ఆదివారం రోజున అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం రోజున రేవంత్ తొందరపాటు .. ఆయన ఆవేశం కారణంగా ఆయన 'టికెట్ టు ఫినాలే'లో గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఆ ఛాన్స్ శ్రీహాన్ కి వెళ్లింది. ఇక ఎలాంటి పోటీ లేకుండా ఆయన ఫైనల్స్ కి వెళ్లిపోయాడు. అంతవరకూ కెప్టెన్సీ చేసినవారిలో ఎవరు బెస్ట్ అనే అభిప్రాయ సేకరణలో మిగిలిన వాళ్లంతా కూడా ఇనయా పేరును చెప్పడం విశేషం. ఇక ఈ ఆదివారం ఎలిమినేషన్స్ రౌండ్ నుంచి రోహిత్ .. కీర్తి .. ఇనయా సేఫ్ కావడం, ఫైమా ఎలిమినేషన్ కావడం జరిగిపోయాయి. క్రితం వారమే రాజ్ కంటే ఫైమాకి తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. అయినా ఆమె ఎలిమినేషన్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. బిగ్ బాస్ హౌస్ కి ఫైమా తల్లి వచ్చినప్పుడు, శ్రీ సత్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. అదే ఎపిసోడ్ లో శ్రీసత్య తల్లి పరిస్థితిని చూసి ఆడియన్స్ చలించిపోయారు. 

అలాంటి పరిస్థితుల్లో ఫైమా తల్లి .. శ్రీ సత్యను గురించి అలా మాట్లాడటం ఫైమా ఎలిమినేషన్ కి కారణం కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక ఫైమా తన చేతిపై ఎవరినీ ముద్దు పెట్టుకోనివ్వదనీ .. తనకి చక్కిలిగిలి అని, ఆమె నాగ్ తో స్టేజ్ పై ఉండగా రేవంత్ చెప్పాడు. దాంతో సరదాగా నాగార్జున ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టేశారు. ఫైమా సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ .. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ సరదా సన్నివేశం నవ్వులు పూయించింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
కష్టాల్లో వున్న సీనియర్ కెమెరామెన్ కు ఆర్ధిక సాయాన్ని అందించిన మెగాస్టార్!
 • కెమెరామెన్ గా పనిచేసిన దేవరాజ్ 
 • ఆయన జాబితాలో 300లకి పైగా సినిమాలు
 • మేజర్ యాక్సిడెంట్ వలన నడవలేని పరిస్థితి 
 • మందులకు డబ్బులు లేవని ఆవేదన 
 • 5 లక్షల చెక్ ను అందించిన మెగాస్టార్

ap7am

..ఇది కూడా చదవండి
మొన్న ఉగ్రవాది.. ఇప్పుడు గూఢచారిగా కనిపించనున్న సమంత!
 • ‘సిటాడెల్’ హిందీ వెబ్ సిరీస్‌ లో సమంత కీలక పాత్ర
 • సమంత స్టయిలిష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర బృందం
 • ఫ్యామిలీ మ్యాన్2 సిరీస్ లో ఉగ్రవాది పాత్రలో మెప్పించిన సమంత

..ఇది కూడా చదవండి
అందాల బుట్టబొమ్మ .. పూజ హెగ్డే లేటెస్ట్ పిక్స్ !
 • క్రితం ఏడాది వరుస ఫ్లాపులు ఎదుర్కున్న పూజ హెగ్డే
 • ఈ ఏడాది మహేశ్ మూవీతో సెట్స్ పైకి 
 • తమిళ .. హిందీ భాషల్లోను కుదురుకునే ప్రయత్నం 
 • కొత్త భామల పోటీని తట్టుకుంటూ ముందుకు  


More Latest News
Stones From Nepal Reach Ayodhya Likely To Be Used For Rams Idol
Home made single wheeled self balancing KTM bike
AP governament serious on Kotam reddy telephone tapping issue
tdp politbeuro member yanamala press note
Adani row storms Parliament Opposition demands probe
 Chiranjeevi Helped Senior Cameraman Devaraj
SAMANTHA RUTH PRABHU JOINS VARUN DHAWAN IN INDIAN INSTALMENT OF CITADEL
Income tax clarity day after Budget 2023 Which scheme works for you best
Military Drone Caught In Fisherman Net At Santhabommali Srikakulam
Pooja Hegde Special
Chinas aggression against India Taiwan unacceptable US Senators tell Blinken ahead of Beijing visit
Director Trivikram Srinivas Plays Cricket In SSMB 28 Movie Shooting Sets Watch Vide
Sagar Old Interviews
Veteran Telugu Film director Sagar passes away
I wasnot living up to my expectations in T20Is But you gave me confidence Gills heartfelt message for Hardik
..more