టాటా ఏస్ వాహనం బోల్తా.. బాపట్లలో నలుగురు అయ్యప్ప భక్తుల మృతి
05-12-2022 Mon 09:54 | Andhra
- అదుపు తప్పి బోల్తా పడిన వాహనం
- మరో 15 మందికి తీవ్ర గాయాలు
- తెనాలి ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

బాపట్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం వేమూరు మండలం జంపని వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. మృతులను కృష్ణా జిల్లా నిలపూడి గ్రామానికి చెందిన బొలిశెట్టి పాండురంగారావు (40), పాశం రమేశ్ (55), బోదిన రమేశ్ (42), బుద్దన పవన్ కుమార్ (25) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More Latest News
భోగాపురంలో ఒబెరాయ్ హోటల్స్కు 40 ఎకరాల కేటాయింపు!
12 minutes ago

ఉత్కంఠపోరులో టీమిండియాదే విజయం
9 hours ago

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు
10 hours ago

బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం
10 hours ago

రెండో టీ20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్
11 hours ago

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
12 hours ago

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్
12 hours ago

టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్
13 hours ago
