నేవీ క్యాడెట్ గా చిరంజీవి...అరుదైన ఫొటో ఇదిగో!
04-12-2022 Sun 19:51 | Both States
- ఇవాళ నేవీ డే
- ఆసక్తికర ఫొటో పంచుకున్న మెగాస్టార్
- గతంలో ఎన్ సీసీలో ఉన్న చిరంజీవి
- ఇటీవల చిరంజీవిని కలిసిన నేవీ అధికారులు
- పాత రోజులు గుర్తుకొచ్చాయన్న చిరు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళ నేవీ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటో చిరంజీవి కాలేజీ రోజుల నాటిది. అందులో ఆయన నేవీ క్యాడెట్ యూనిఫాంలో ఉన్నారు.
గోవా ఎయిర్ పోర్టులో గతవారం తనను కొందరు నేవీ ఆఫీసర్లు కలిశారని చిరంజీవి వెల్లడించారు. దాంతో తనకు పాతరోజులు గుర్తుకువచ్చాయని తెలిపారు. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎన్ సీసీలో నావల్ క్యాడెట్ గా ఉన్నానని వివరించారు.
కాగా, తనకు క్రమశిక్షణ అలవడిందంటే అందుకు కారణం ఎన్ సీసీ అని చిరంజీవి గతంలోనూ చెప్పారు. ఎన్ సీసీలో ఉన్నప్పుడు 1976 రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ తరఫున రాజభవన్ లో మార్చ్ పాస్ట్ లో పాల్గొన్నానని వెల్లడించారు. ఇటీవల వైఎన్ఎమ్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న చిరంజీవి ఈ సంగతులు పంచుకున్నారు.
More Latest News
టీడీపీ హయాంలోనూ అవినీతి జరిగింది.. మేం కూడా సత్యవంతులం ఏమీ కాదు: ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
11 minutes ago

ఉత్కంఠపోరులో టీమిండియాదే విజయం
8 hours ago

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు
9 hours ago

బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం
9 hours ago

రెండో టీ20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్
10 hours ago

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
11 hours ago

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్
11 hours ago

టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్
12 hours ago

లోకేశ్ యువగళం పాదయాత్రకు కర్ణాటక పోలీసులు
13 hours ago

సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ఖరారు
13 hours ago
