600 మంది ఉద్యోగులను తొలగించనున్న ఓయో
03-12-2022 Sat 16:25 | Business
- టెక్నాలజీ, కార్పొరేట్ విభాగానికి చెందిన ఉద్యోగుల తొలగింపు
- తొలగించిన ఉద్యోగులకు 3 నెలల పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్
- రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ టీమ్ లోకి 250 మందిని తీసుకోనున్నట్టు వెల్లడి

ఎంఎన్సీలలోనే కాకుండా దేశీయ కంపెనీల్లో సైతం ఉద్యోగుల తొలగింపులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే జొమాటో, బైజూస్ వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఆతిథ్య సేవలు అందించే ఓయో సంస్థ సైతం ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగానికి చెందిన 600 మంది ఉద్యోగులను తొగించబోతున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ టీమ్ లోకి కొత్తగా 250 మందిని తీసుకోనున్నట్టు వెల్లడించింది. తొలగించిన ఉద్యోగులకు 3 నెలల పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్ కొనసాగుతుందని తెలిపింది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు చేపడితే తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యతను ఇస్తామని పేర్కొంది.
More Latest News
ముంబయి బిజినెస్ మేన్ ను పెళ్లాడిన 'నేనింతే 'హీరోయిన్
54 minutes ago

హైదరాబాదీలను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు
2 hours ago

నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి
3 hours ago

తమిళనాడు చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు లేఖ
4 hours ago

హరిరామజోగయ్య పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
4 hours ago
