ఈ ముగ్గురినీ చూసి ప్రజలు ఏం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు: రోజా
01-12-2022 Thu 16:38 | Andhra
- చంద్రబాబు రాయలసీమ ద్రోహి అన్న రోజా
- తండ్రిలాంటి ఎన్టీఆర్ ను చంపిన వ్యక్తి అని విమర్శ
- ఎమ్మెల్యే కూడా కాలేని లోకేశ్ ని సీఎం చేయాలనుకుంటున్నారని ఎద్దేవా

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని అన్నారు. ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని... ఆయనకు ఫ్యూజులు ఎగిరిపోయాయని, మెంటర్ బ్యాలెన్స్ పడిపోయిందని చెప్పారు. ఎమ్మెల్యే అవడమే కష్టం అనుకుంటున్న లోకేశ్ ను సీఎం చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తండ్రిలాంటి ఎన్టీఆర్ ను చంపిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ తమను చంపాలనుకుంటున్నారని చెపుతూ సింపథీ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. వీరు ముగ్గురినీ చూసి రాష్ట్ర ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని అన్నారు. తిరుపతిలో జరుగుతున్న జగనన్న క్రీడా సంబరాలు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
More Latest News
పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
3 minutes ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
9 minutes ago

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి
27 minutes ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
49 minutes ago

మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్ చిత్రం
1 hour ago

ఎమ్మెల్సీ తలశిల రఘురాంను ఓదార్చిన సీఎం జగన్
2 hours ago
