జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్
01-12-2022 Thu 14:38 | National
- ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా జీ-20
- ఏడాదిపాటు జీ-20 అధ్యక్ష స్థానంలో భారత్
- ఇటీవల ఇండోనేషియాలో జీ-20 సదస్సు
- ఇండోనేషియా నుంచి అధ్యక్ష బాధ్యతలు భారత్ కు బదిలీ

బలమైన ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్ కు విశిష్ట ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నేడు చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు. డిసెంబరు 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ఆ సమావేశంలో ప్రకటించారు.
భారత్ ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు.
More Latest News
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై మరోసారి స్పందించిన అలీ
35 minutes ago

టర్కీలో మళ్లీ భూకంపం... వేలల్లో మృతుల సంఖ్య!
1 hour ago

బాలయ్య చీఫ్ గెస్టుగా 'వేద' ప్రీ రిలీజ్ ఈవెంట్!
2 hours ago

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై బండి సంజయ్ స్పందన
2 hours ago

'బుట్టబొమ్మ' (మండే టాక్)
2 hours ago

25 రోజులను పూర్తిచేసుకున్న 'వాల్తేరు వీరయ్య'
3 hours ago
